యాప్నగరం

రూ.4 కోట్ల బీమా కొట్టేయాలని పథకం వేసి...

తన పేరిట ఉన్న బీమా సొమ్మును కొట్టేయాలని పక్కాగా పథకం వేశాడు. సినిమాలను తలపించేలా స్క్రిప్ట్ రాసుకుని, డబ్బు సొంతం చేసుకున్నా అడ్డంగా దొరికిపోయాడు.

TNN 30 Jun 2017, 11:47 am
తన పేరిట ఉన్న బీమా సొమ్మును కొట్టేయాలని పక్కాగా పథకం వేశాడు. సినిమాలను తలపించేలా స్క్రిప్ట్ రాసుకుని, డబ్బు సొంతం చేసుకున్నా అడ్డంగా దొరికిపోయాడు. హోటల్‌లో పనిచేసే వెయిటర్‌ను హత్య చేసి, అది తానేనని నమ్మించడం వరకూ విజయం సాధించిన అతడు, పోలీసుల దర్యాప్తులో మాత్రం పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాసిక్‌కు చెందిన 39 ఏళ్ల రామ్‌దాస్ వాఘా రియల్ ఎస్టేట్ వ్యాపారి. తన పేరుతో మూడు కంపెనీలలో రూ.4 కోట్లకు బీమా చేశాడు. ఆ డబ్బును ఎలాగైనా కొట్టేయాలని మరో ముగ్గురి సాయంతో ఓ పథకం వేశాడు.
Samayam Telugu nashik man kills restaurant waiter to fake own death for 4 crore insurance
రూ.4 కోట్ల బీమా కొట్టేయాలని పథకం వేసి...


ఈ నెల 9వ న త్రయంబకేశ్వర్ సమీపంలో ఓ రోడ్డు ప్రమాదం సంభవించింది. మృతుడి తలపై నుంచి వాహనం వెళ్లడంతో గుర్తుపట్టలేనంతగా మారింది. ఘటనా స్థలి వద్ద ద్ద లభించిన ఏటీఎం కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఆధారంగా మృతుడి రామ్‌దాస్ వాఘాగా పోలీసులు గుర్తించారు. దీంతో అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అతడు చనిపోయినట్లు బీమా కంపెనీలకు విషయం తెలియజేసి, ఆ డబ్బు కొట్టేశారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో రోడ్డు ప్రమాదం కాదని, హత్యచేసి వాహనంతో తొక్కించారని తేలడంతో పోలీసులు కేసును మూసివేయకుండా విచారణ ప్రారంభించారు.

కేసులో భాగంగా అతడి బంధువులు, స్నేహితులను విచారిస్తుంటే నిజాలు తెలిసి పోలీసులు విస్తుపోయారు. ప్రమాదంలో వాఘా మరణించలేదని, అతడు బతికే ఉన్నాడన్న నిజం వెలుగుచూసింది. అక్కడ లభించిన మృతదేహం తమిళనాడుకు చెందిన ముబారక్ చాంద్ పాషా అనే వ్యక్తిదని, అతడు ఓ రెస్టారెంటులో వెయిటర్‌గా పని చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో వాఘాకు సహకరించిన మిగతా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వాఘా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నిందుతుడు క్లయిమ్ చేసిన సొమ్ము కూడా ఇంకా రికవరీ కాలేదని, కేసును విచారిస్తున్నామని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని ఓ పోలీసు అధికారి తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.