యాప్నగరం

పాపం రిపోర్టర్.. స్నో బాల్ దెబ్బకు విలవిల!

ఓ మహిళా రిపోర్టర్ సీరియస్‌గా వాతావరణ విశేషాలు చెప్పడానికి సిద్ధమవుతోంది. ఇంతలో ఓ స్నోబాల్ వేగంగా వచ్చి ఆమె ముఖానికి తగిలింది. ఆ దెబ్బకు ఆమె కళ్లు బైర్లు కమ్మాయి, ఇంతలోనే తేరుకుని వాతావరణ విశేషాలు చెప్పింది.

TNN 19 Dec 2017, 5:08 pm
మహిళా రిపోర్టర్ సీరియస్‌గా వాతావరణ విశేషాలు చెప్పడానికి సిద్ధమవుతోంది. ఇంతలో ఓ స్నోబాల్ వేగంగా వచ్చి ఆమె ముఖానికి తగిలింది. ఆ దెబ్బకు ఆమె కళ్లు బైర్లు కమ్మాయి, ఇంతలోనే తేరుకుని వాతావరణ విశేషాలు చెప్పింది. ఈ సరదా ఘటన అమెరికాలోని విస్కోన్సిన్‌లో చోటుచేసుకుంది. అమీ డుపాంట్ అనే రిపోర్టర్ వార్తలు చదివేందుకు సిద్ధమవుతుండగా.. కెమేరా మేన్ సరదగా ఆమెను ఆటపట్టిదామని అనుకున్నాడు. దీంతో, ఆమె రెడీ అనగానే మంచు ముద్దను ఆమెపైకి విసిరాడు.
Samayam Telugu news anchor gets hit by a snowball before live weather update
పాపం రిపోర్టర్.. స్నో బాల్ దెబ్బకు విలవిల!


అయితే, అది నేరుగా వెళ్లి కంటికి తగిలింది. దీంతో, కాసేపు ఆమె విలవిల్లాడింది. ఆ ముంచు ముద్ద గురితప్పి కంటికి తగలడంతో ఆ కెమేరా మ్యాన్ ఆమెకు సారీ చెప్పాడు. ఆమె వెంటనే తేరుకుని ‘‘ఈ ఉదయం కురిసిన మంచు చూస్తే... నాకే ఆటలాడాలనిపిస్తోంది. నా ముఖం చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు వాతావరణం స్నో ఫైట్‌కు చాలా అనుకూలంగా ఉంది’’ అంటూ.. రిపోర్ట్ చేసింది. ఈ వీడియో మీకు కూడా నచ్చుంది.
funny movement pic.twitter.com/pR0Orc7D9W — Suresh Ch (@chsureshAb) December 19, 2017

మొబైల్ వినియోగదారులు వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.