ముంబైలోని బిగ్ బీ అమితాబ్ ఇంటి గోడని ఓ యువకుడు దూకడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ యువకుడిని 23 ఏళ్ల బుల్లెట్ యాదవ్‌గా గుర్తించారు పోలీసులు. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. బెయిలు రావడానికి సిద్ధంగా ఉన్నా కూడా పూచీకత్తుగా కట్టాల్సిన డబ్బు లేకపోవడంతో జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడు పాటలు పాడడంలో ప్రావీణ్యత సంపాదించాడు. బాలీవుడ్ లో పాడాలన్నది అతని కోరిక. అంతేకాకుండా బుల్లెట్ యాదవ్ అమితాబ్ కు పెద్ద అభిమాని. దీంతో అతను తనను రికమెండ్ చేస్తాడేమో అన్న ఆశతో కలిసేందుకు గోడ దూకాడు. సెక్యూరిటీకి దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.
బెయిలుకు కూడా డబ్బుల్లేక... జైల్లోనే
ముంబైలోని బిగ్ బీ అమితాబ్ ఇంటి గోడని ఓ యువకుడు దూకడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
TNN 3 Aug 2016, 3:28 pm