యాప్నగరం

గూగుల్ సెర్చ్‌లోనే ఇక ఫుడ్ ఆర్డర్ కూడా!

గూగుల్... ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేసిన సెర్చింజన్. రోజుకు రోజుకు తనని తాను అప్‌డేట్ చేసుకుంటూ... వినియోగదారులకు చేరువవుతూ వస్తోంది.

Hindustan Times 10 Aug 2016, 11:28 am
గూగుల్... ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేసిన సెర్చింజన్. రోజుకు రోజుకు తనని తాను అప్‌డేట్ చేసుకుంటూ... వినియోగదారులకు చేరువవుతూ వస్తోంది. తాజాగా మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే మనం ఎలాంటి ఖర్చు లేకుండా... స్విగ్గీ, జొమాటో, ఫుడ్ పాండా లాంటి ఆన్ లైన్ ఫుడ్ సైట్ల నుంచి ఆర్డర్ ఇచ్చుకుంటున్నాం. ఆ ఫుడ్ సైట్ల కోసం మొదట గూగుల్ లో సెర్చ్ చేస్తాం. ఆ సైట్ లోకి వెళ్లి... అందులో ఉన్న రెస్టారెంట్లలో మనకి నచ్చిన రెస్టారెంట్ మెనూలోకి ప్రవేశిస్తాం. అప్పుడు ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటాం. ఇంత ప్రయాస పడాల్సిన అవసరం లేకుండా గూగుల్ సరికొత్త ఫీచర్ ని తెచ్చింది. అయితే ఈ ఫీచర్ కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటంటే... ఏ రెస్టారెంట్ నుంచి అయితే మీరు ఫుడ్ తెప్పించుకోవాలనుకుంటున్నారో... ఆ రెస్టారెంట్ పేరు గూగుల్ సెర్చ్ లో టైప్ చేయాలి. ఆ రెస్టారెంట్ వెబ్ సైట్ వివరాలతో పాటూ... ‘ప్లేస్ ఏన్ ఆర్డర్’ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసేసరికి నేరుగా ఫుడ్ డెలివరీ సైట్లైనా స్విగ్గీ, జొమాటో సైట్లకు తీసుకెళుతుంది. వెంటనే అక్కడ ఆర్డర్ ఇచ్చేయడమే. బాగుంది కదా ఈ కొత్త ఆప్షన్. ఇది బుధవారం నుంచే అమల్లోకి వస్తోంది. సో... ఎంజాయ్ యువర్ ఫుడ్.
Samayam Telugu now order food directly via google search
గూగుల్ సెర్చ్‌లోనే ఇక ఫుడ్ ఆర్డర్ కూడా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.