యాప్నగరం

ఆపిల్, గూగుల్ స్టోర్‌లో ప్లేబాయ్ మ్యాగజైన్

కొత్త తరం పాఠకులను ఆకర్షించేందుకు తమ నగ్న రహిత మ్యాగజైన్‌ను తొలిసారి ఆపిల్, గూగుల్ స్టోర్లలో అందుబాటులో ఉంచినట్లు ప్లేబాయ్ ప్రకటించింది.

TNN 13 Oct 2016, 6:09 pm
కొత్త తరం పాఠకులను ఆకర్షించేందుకు తమ నగ్న రహిత మ్యాగజైన్‌ను తొలిసారి ఆపిల్, గూగుల్ స్టోర్లలో అందుబాటులో ఉంచినట్లు ప్లేబాయ్ ప్రకటించింది. తాజాగా తమ మ్యాగజైన్‌లో నగ్న చిత్రాలకు సెలవు పలికిన ప్లేబాయ్ సంస్థ మరింత మంది పాఠకులకు చేరువయ్యేందుకు ఐట్యూన్స్, గూగుల్ ప్లే స్టోర్‌లోకి తొలిసారి ప్రవేశించింది. ఈ ఏడాది ప్రారంభంలో కొత్త విజన్‌తో ముందుకొచ్చిన ప్లేబాయ్ మ్యాగజైన్‌ను వీలైనన్ని ఎక్కువ మార్గాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆ సంస్థ సీఈవో డేవిడ్ ఇజ్రాయిల్ వెల్లడించారు. సంప్రదాయ, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా పాఠకులను పెంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
Samayam Telugu nudity free playboy magazine debuts on apple and google play stores
ఆపిల్, గూగుల్ స్టోర్‌లో ప్లేబాయ్ మ్యాగజైన్

ప్రపంచ వ్యాప్తంగా కొత్త పాఠకులను సంపాదించడానికి ఐట్యూన్స్, గూగుల్ ప్లేస్టోర్ సరైన వేదికని, ఇకపై ఇక్కడ నుంచి తమ సేవలను కొనసాగిస్తామని డేవిడ్ చెప్పారు. 1950ల్లో ప్రారంభమైన ప్లేబాయ్ మ్యాగజైన్ అర్ధనగ్న చిత్రాలో మాస్ మార్కెట్‌ను కొల్లగొట్టింది. అయితే మార్చి 2016 ఎడిషన్‌ను మాత్రం పూర్తిగా మార్చేశారు. నగ్న చిత్రాలు లేకుండా ఈ మ్యాగజైన్‌ను తయారుచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.