యాప్నగరం

సోషల్ మీడియాలో పన్నీరే హీరో..

తమిళనాట ముఖ్యమంత్రి సీటు కోసం జరుగుతున్న పోరు రసవత్తరంగా మారడంతో పన్నీర్ సెల్వం అభిమానులు, మద్దతుదారులు సోషల్ మీడియాలో జోరుపెంచారు.

TNN 10 Feb 2017, 3:40 pm
తమిళనాట ముఖ్యమంత్రి సీటు కోసం జరుగుతున్న పోరు రసవత్తరంగా మారడంతో పన్నీర్ సెల్వం అభిమానులు, మద్దతుదారులు సోషల్ మీడియాలో జోరుపెంచారు. తమిళనాడుకు ముఖ్యమంత్రి పన్నీరే అంటూ ఆయన్ని హీరోను చేస్తున్నారు. అంతేకాకుండా రజనీకాంత్ పాటలను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. అమ్మ ఉన్నప్పుడు సెల్వం ఎలా ఉండేవారు.. ఇప్పుడు ఆయన ఓ శక్తిగా ఎలా మారారో చూపిస్తూ ఫేస్‌బుక్‌లో షార్ట్ ఫిల్మ్‌లు పోస్ట్ చేస్తున్నారు.
Samayam Telugu panneerselvam becomes hero on social media
సోషల్ మీడియాలో పన్నీరే హీరో..


కబాలి సినిమాలో రజినీకాంత్ చెప్పిన డైలాగులు పన్నీరుకు అనుకూలంగా మార్చి యూట్యూబ్‌లో పెడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ వైరల్‌గా మారుతున్నాయి. కాగా, దేశవ్యాప్తంగా వార్తా వెబ్‌సైట్లతో పాటు కొన్ని సంస్థలు నిర్వహించిన పోల్స్, సర్వేలో 90 శాతానికి పైగా పన్నీర్ సెల్వం సీఎం కావాలని అభిప్రాయం వ్యక్తం చేసారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.