యాప్నగరం

రైల్వే టికెట్‌పై ముద్రించిన సమాచారం చదివి...

ప్రతి ప్రయాణికుడు టిక్కెట్ ధరపై రాయితీ కింది 43 శాతం రైల్వే శాఖ భరిస్తోంది.... దీంతో ప్రభుత్వానికి ఏటా రూ.30,000 కోట్ల నష్టం వాటిళ్లుతోంది.

TNN 28 Jun 2017, 12:04 pm
ప్రతి ప్రయాణికుడు టిక్కెట్ ధరపై రాయితీ కింది 43 శాతం రైల్వే శాఖ భరిస్తోంది.... దీంతో ప్రభుత్వానికి ఏటా రూ.30,000 కోట్ల నష్టం వాటిళ్లుతోంది. ఈ విషయం గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించడానికి టిక్కెట్‌పై గతేడాది జూన్ 22 నుంచి ముద్రిస్తోంది. ఈ సమాచారాన్ని చదివిన ఓ ప్రయాణీకుడు చార్జీలలో ప్రభుత్వం కల్పించే రాయితీని చెల్లించేందుకు ఐఆర్సీటీసీకి రూ.950 చెక్కు పంపించాడు. రాయితీ తనకు అవసరం లేదని, ప్రభుత్వం తన టికెట్ ధరపై భరించిన 43 శాతానికి చెక్కుపంపుతున్నానని పేర్కొంటూ ఢిల్లీలోని ఐఆర్సీటీసీ కార్యాలయానికి చెక్కు పంపాడు. అయితే నిబంధనల ప్రకారం ఇలాంటి చెక్కులను స్వీకరించే అవకాశం లేకపోవడంతో తిరిగి పంపుతామని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
Samayam Telugu passenger sends cheque to railways foregoing fare subsidy
రైల్వే టికెట్‌పై ముద్రించిన సమాచారం చదివి...


జమ్మూ నుంచి నుంచి న్యూఢిల్లీ వెళ్లే రైల్లో తన భార్యతో ప్రయాణించిన ఆ వ్యక్తి ఇద్దరి టిక్కెట్‌పై ప్రభుత్వం కల్పించిన 43 శాతం రాయితీని చెక్కు రూపంలో పంపాడు. దీంతోపాటు రైల్వే శాఖ మంత్రికి ఓ లేఖ కూడా రాశాడు. భవిష్యత్తులో తాను ఇలాంటి ఆర్థిక లబ్దిని పొందనని లేఖలో పేర్కోన్నాడు. అంతేకాదు సీనియర్ సిటిజన్ టిక్కెట్‌పై రైల్వే శాఖ ఇప్పటికే రాయితీ ఇస్తోందని, కానీ ఆర్థికస్థోమత కలిగిన వారు స్వచ్ఛందంగా దీన్ని వదులుకోవాలని సూచించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.