యాప్నగరం

రిక్షా ఎక్కిన పేటీఎం సీఈవో

ట్రాఫిక్... దాదాపు అన్ని నగరాలను వేధిస్తున్న ప్రధాన సమస్య.

TNN 29 Oct 2016, 12:56 pm
ట్రాఫిక్... దాదాపు అన్ని నగరాలను వేధిస్తున్న ప్రధాన సమస్య. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సమస్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ట్రాఫిక్ జామ్ లు జరగడం నిత్యకృత్యమైపోయింది. సామాన్యులకు ఈ సమస్య ఎదురైతే పెద్దగా చెప్పుకోరు కానీ... సెలెబ్రిటీలకు, బిజినెస్ మ్యాన్లకు ఎదురైతే మాత్రం అదో పెద్ద వార్తే. అవును... పేటీఏం సీఈవో ట్రాఫిక్‌కు భయపడి సాదాసీదా రిక్షాలో సీఎంను కలిసేందుకు వెళ్లారు. అందుకే మనమిప్పుడు ఈ ట్రాఫిక్ గురించి ఇంతగా చెప్పుకున్నాం. అసలేం జరిగిందంటే...
Samayam Telugu paytm ceo vijay shekhar sharma came to akhilesh yadavs house on rickshaw
రిక్షా ఎక్కిన పేటీఎం సీఈవో


యూపీ సీఎం అఖిలేష్ ను కలిసేందుకు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ అప్పాయింట్ మెంట్ తీసుకున్నారు. తన పడవకారులో బయలుదేరారు. తీరా భారీ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారు. ఎంతసేపైనా ట్రాఫిక్ జామ్ తగ్గేట్టు కనిపించడం లేదు. దీంతో విసిగి పోయిన విజయ్ కారు దిగి పక్కనే ఉన్న ఓ రిక్షా ఎక్కాడు. ఆ రిక్షా వాడు... సీఎం నివాసానికి అనగానే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. ఆనందంతా చకచకా తొక్కుతూ సీఎం నివాసానికి తీసుకెళ్లాడు. కోట్లకు అధిపతి అయిన విజయ్ రిక్షాలో రావడం చూసి అఖిలేష్ ఆశ్చర్యపోయాడు. రిక్షా వాడితో కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ ఖాతాలో పెట్టాడు. ఆ ఫోటోకు మెట్రో రాకతోనే లక్నలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయంటూ కామెంట్ కూడా పెట్టాడు అఖిలేష్.
A traffic jam forced Paytm CEO Vijay Shekhar Sharma to visit us in a cycle rickshaw. Lucknow Metro will help solve the traffic jams in city. pic.twitter.com/SDzZy0mjMX — Akhilesh Yadav (@yadavakhilesh) October 27, 2016
రిక్షావాలాకు కొత్త రిక్షా, ఇల్లు

విజయ్ ను సీఎం ఇంటికి చేర్చిన రిక్షా వాలా పేరు మణిరామ్. అతనితో కాసేపు మాట్లాడిన అఖిలేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంతిళ్లు కూడా లేని ఆయనకి ఇల్లు కట్టిస్తానని, కొత్త రిక్షా ఇస్తానని చెప్పారు. అలాగే విజయ్ ను గమ్యస్థానం చేర్చినందుకు రూ.6వేలు ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.