యాప్నగరం

చితి మంటల్ని ఆపి... డెడ్ బాడీ స్వాధీనం

రాజస్థాన్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.

TNN 17 Oct 2016, 4:31 pm
రాజస్థాన్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. భరత్‌పూర్‌లోని నబడై ప్రాంతంలో 45 ఏళ్ల వ్యక్తి మరణించారు. అతడి పార్థివదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. చితిని పేర్చి నిప్పంటించారు. సరిగ్గా అదే సమయానికి పోలీసులు పరిగెట్టుకుంటూ వచ్చి చితిని ఆర్పే ప్రయత్నం చేశారు. నీళ్లు కుమ్మరించి మంటల్ని ఆపేశారు. ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి పోస్టు మార్టం చేయించారు. ఇలా సగం కాలిన బాడీని కూడా పోలీసులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అంటే ఆ వ్యక్తిది సహజ మరణం కాదు. కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు. ఆ విషయాన్ని దాచి హడావుడిగా కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. విషయం పోలీసులకు చేరడంతో వారొచ్చి ఆ పని చేయాల్సి వచ్చింది.
Samayam Telugu police doused a funeral pyre and took the dead body for post mortem
చితి మంటల్ని ఆపి... డెడ్ బాడీ స్వాధీనం


పదమ్ సింగ్ (45) కుటుంబసభ్యులతో గొడవల నేపథ్యంలో జైలుకెళ్లాడు. నెల రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. ఏం జరిగిందో తెలియలేదు కానీ... కొడుకు భగత్ సింగ్ చేతిలో హత్యకు గురయ్యాడు. హత్యకు ముందు పదమ్ సింగ్ తాగేసి కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడు. వీధిలో రక్తపు మరకలని కూడా పోలీసులు ఆధారంగా తీసుకున్నారు. కొడుకుని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.