యాప్నగరం

స్టేషన్‌లోనే పార్టీ చేసుకుని చిందేసిన పోలీసులు

నిత్యం కేసుల గొడవలేనా.. ఒకసారి మందేసి చిందేద్దాం అని అనుకున్నారో లేక మనల్ని అడిగే వాళ్లు ఎవరని భావించారో..

TNN 8 May 2017, 9:59 pm
నిత్యం కేసుల గొడవలేనా.. ఒకసారి మందేసి చిందేద్దాం అని అనుకున్నారో లేక మనల్ని అడిగే వాళ్లు ఎవరని భావించారో తెలియదు కానీ పోలీసు స్టేషన్‌లోనే మందేసి చిందేశారు పోలీసులు. ఈ పార్టీ ఇచ్చింది ఇంకెవరో కాదు.. ఆ స్టేషన్ హౌజ్ ఆఫీసర్. అవును స్వయంగా ఆ స్టేషన్ ఎస్సై ఇచ్చిన ఈ పార్టీ ఇలా మీడియా కెమెరాకి చిక్కింది.
Samayam Telugu police station house officers private party in police station
స్టేషన్‌లోనే పార్టీ చేసుకుని చిందేసిన పోలీసులు


రాజస్థాన్‌లోని భరత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ పార్టీ డ్యూటీలో వున్న వారి నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. అంతేకాకుండా అతిథులని అలరించడానికని మహిళా డ్యాన్సర్లని సైతం తీసుకొచ్చినట్టు సమాచారం. తరచుగా నేరాలతో హెడ్‌లైన్స్‌లో నిలిచే ఈ భరత్‌పూర్ ఇప్పుడిలా వార్తల్లోకెక్కడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.