యాప్నగరం

పోలీసును నీట ముంచి కుమ్మేశాడు

ముంబైలో రోజురోజుకి పోలీసులపై దాడులు పెరిగిపోతున్నాయి.

TNN 7 Sep 2016, 3:14 pm
ముంబైలో రోజురోజుకి పోలీసులపై దాడులు పెరిగిపోతున్నాయి. మొన్నటిమొన్న అడ్డదిడ్డంగా బైక్ నడుపుతున్నారని ఆపిన పాపానికి ఇద్దరు (అక్క, తమ్ముడు) ఓ మహిళా కానిస్టేబుల్ పై దాడి చేయడంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన మరవకముందే మంగళవారం మరో సంఘటన చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా కళ్యాణ్ లోని ఓ చెరువు దగ్గర భక్తుల కోసం రక్షణగా ఉన్న ఓ పోలీసును ఓ వ్యక్తి నీళ్లలోకి తోసేసి మరీ దాడికి దిగాడు. ఆవ్యక్తి పోలీసుపై దాడి చేస్తున్న దృశ్యాలు బయటకివచ్చాయి. అయితే పోలీసు నిమజ్జనం సందర్భంగా క్యూపద్ధతి పాటించాలని భక్తులను తీవ్రంగా హెచ్చిరించినందుకు ఆగ్రహంతో ఓ వ్యక్తి ఇలా దాడి చేసినట్లు తెలిసింది. అయితే నీళ్ల పోలీసుపై ఇష్టానుసారంగా దాడి చేసిన వ్యక్తిపై హత్యానేరం కింద కేసు నమోదైంది. పోలీసులపై జరుగుతున్న దాడుల పట్ల మహారాష్ట్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శివసేన కూడా ప్రజల్ని రక్షించాల్సిన పోలీసుల మీద దాడులు జరిగితే వారికి రక్షణ కల్పించేది ఎవరని ఆందోళన వ్యక్తం చేసింది.
Samayam Telugu policeman was beaten by a man in water
పోలీసును నీట ముంచి కుమ్మేశాడు

పోలీసుపై దాడి దృశ్యాలు చూడండి.

Kalyan, Maha: Video shows how a youth tried to drown a police officer in a pond during the immersion of Ganesh idols pic.twitter.com/pSrup4fLCZ— TIMES NOW (@TimesNow) September 7, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.