యాప్నగరం

భుజాలపై మోసి.. గర్భిణి ప్రాణాలను కాపాడారు

హిమాచల్ ప్రదేశ్‌లో దట్టమైన మంచు కురుస్తోన్న వేళ ఆరుగురు పోలీసులు ఓ గర్భిణిని కాపాడారిలా..

TNN 16 Jan 2017, 5:17 pm
హిమాచల్ ప్రదేశ్‌ రాజధాని షిమ్లా సమీపంలో బోంట్ అనే గ్రామం ఉంది. ఆ ఊరికి చెందిన 23 ఏళ్ల కామిని అనే నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఆ సమయంలో ఇంట్లో ఆమెకు తోడుగా ఆమె తల్లి సరళ తప్ప ఇంకెవరూ లేరు. నొప్పులు వచ్చిన వెంటనే ఆమె తల్లి అంబులెన్స్‌కు కాల్ చేసింది. సమయం గడిచే కొద్దీ ఆమెకు నొప్పులు ఎక్కువ అవుతున్నాయి కానీ.. అంబులెన్స్ మాత్రం రాలేదు. బయట మంచు దట్టంగా కురుస్తున్న కారణంగా రోడ్ల మీద వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. క్రమేపీ చీకటి కూడా పడుతుండటంతో ఏం చేయాలో ఆమె తల్లికి పాలుపోలేదు. ఇక నా కూతురు బతకడం కష్టమే అనుకొంది.
Samayam Telugu policemen walk for 3 hours through snow clad route to get pregnant woman to hospital
భుజాలపై మోసి.. గర్భిణి ప్రాణాలను కాపాడారు


సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ గర్భిణిని మేం రక్షిస్తాం అంటూ ముందుకొచ్చారు. ఆరుగురు పోలీసులు ఆ గర్భిణిని ఓ కుర్చీలో కూర్చోబెట్టారు. మంచు పడకుండా, చలి నుంచి రక్షించడం కోసం ఆమెపై బొంతను కప్పారు. ఆమెను భుజాలపై మోస్తూ.. మూడున్నర గంటలపాటు మంచులో కష్టపడి నడిచి.. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ హాస్పిటల్లో చేర్పించారు. దీంతో ఆ గర్భిణి ప్రాణాలతో బయటపడింది.

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రతి ఏడాదిలాగే ఈ శీతాకాలంలోనూ మంచు విపరీతంగా కురుస్తోంది. దట్టంగా కురుస్తోన్న మంచు కారణంగా అక్కడ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.