యాప్నగరం

పోర్న్ వీడియోలు షేర్ చేస్తున్న మంత్రి పీఏ

ఇంద్రవతి ఆఫీసర్స్’ అనే వాట్సాప్ గ్రూపులో ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులకు హోంమంత్రి పీఏ నెంబర్ నుంచి ఆరు పోర్న్ వీడియోలు షేర్ కావడం కలకలం సృష్టిస్తోంది.

TNN 14 Nov 2016, 4:00 pm
చత్తీస్ ఘడ్ హోం శాఖమంత్రి రామ్ సేవాక్ పైక్రా వ్యక్తిగత కార్యదర్శి సీఎల్ భయ సెల్ నుంచి రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు పోర్న్ వీడియోలు షేర్ అవుతున్నాయి.
Samayam Telugu porn clips sent to staff from ministers aides tablet
పోర్న్ వీడియోలు షేర్ చేస్తున్న మంత్రి పీఏ


‘ఇంద్రవతి ఆఫీసర్స్’ అనే వాట్సాప్ గ్రూపులో ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులకు హోంమంత్రి పీఏ నెంబర్ నుంచి ఆరు పోర్న్ వీడియోలు షేర్ కావడం కలకలం సృష్టిస్తోంది.

ఈ గ్రూపులో అనేక మంది మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు. మంత్రి పీఏ నెంబర్ నుంచి వాట్సాప్ ద్వారా అశ్లీల వీడియోలు రావడంతో వాళ్లంతా షాకయ్యారు. ఖంగుతున్న అధికారులు కొంతమంది వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కు ఫిర్మాదు చేశారు.

అయితే తనకు తెలియకుండానే తన నెంబర్ నుంచి ఆ పోర్న్ వీడియోలు షేర్ అయిన మాట వాస్తవమేనని ఎల్సీ భయ అంగీకరించారు. తనను బద్నామ్ చేసేందుకు ఎవరో ఈ కుట్రపన్నారని ఆయన అంటున్నారు.

అయితే కొద్దిరోజుల క్రితమే తన టాబ్లెట్ ఫోన్ తస్కరణకు గురైందని, అప్పటినుంచే పోర్న్ వీడియోలు షేర్ అవుతున్నాయని ఆయన అన్నారు.
పోలీసులు విచారణ ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.