ఇళ్లల్లో చిన్నపాటు ఎలక్ట్రిసిటీ ఎర్తింగ్ తగిలితేనే విలవిలాడుతాం. షాక్ తగిలితే అంతే. అలాంటిది ఓ మనిషిని హైహోల్టేజ్ విద్యుత్ ఏమీ చేయలేకపోయింది. వినడానికి ఇది నమ్మశక్యంగా లేకున్నా..వీడియో చూస్తూ మీరే నమ్మితీరుతారు.
30వేల వోల్టుల విద్యుత్ పారుతున్న 100 ఫీట్ల ఎత్తున్న స్తంభం పై నుంచి ఓ వ్యక్తి కిందపడిపోవడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. షార్ట్ సర్క్యూట్ వల్లో లేక మరే ఇతర కారణం వల్లో కానీ..ఆ స్తంభంపై ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కింది పడిపోయాడు.
ఆ మంటలకు దారినపోయే ప్రతి ఒక్కరు..స్తంభంపై ఉన్న వ్యక్తి ‘గోవిందా’ అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరు. ఆ స్తంభం పై నుంచి కిందపడ్డ ఆ వ్యక్తి తుప్పల్లో నుంచి కాలిన గాయాలతో ఏడుస్తూ మెయిన్ రోడ్ పై వచ్చాడు. దీంతో కరెంటు షాకివ్వని మనిషి చూసి జనం షాక్ తో నోరెళ్లబెట్టారు.
అయితే ఈ వీడియో అప్ లోడ్ చేసింది ఎవరో..సంఘటన ఎక్కడ జరిగిందో...పేర్కొనకపోవడంతో కొంతమంది ఇది ‘ఫేక్’ అని కూడా అంటున్నారు. కానీ ఆ వ్యక్తి కాలిన గాయలు..సంఘటనను చూస్తుంటే మాత్రం..నిజమేననిపిస్తోంది. మీరూ చూడండి..