యాప్నగరం

ప్రీతి జింతాకి పెళ్లయిపోయింది...

సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతాకు పెళ్లయిపోయిందట.

TNN 1 Mar 2016, 2:43 pm
సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతాకు పెళ్లయిపోయిందట. లాస్ ఏంజలస్‌లో తన ప్రియుడు జెనె గుడెనఫ్ ని ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా కేవలం కుటుంబ సభ్యుల మధ్యే వివాహం చేసుకుందట. ఫిల్మ్‌‌ఫేర్.కామ్ కథనం ప్రకారం... ఫిబ్రవరి 29న ఆమె పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే హాజరైనట్టు తెలుస్తోంది. ఆమె ప్రీతికి చాలా ఆప్త మిత్రురాలు. ప్రీతి, సుసానే, మరో స్నేహితురాలు సురిలీ గోయెల్ కొన్ని రోజులుగా లాస్ ఏంజలస్ లోనే ఉంటున్నారు. కాగా ప్రీతి ఏప్రిల్ లో భర్తతో కలిసి ఇండియాకు తిరిగి వస్తుంది. ఇక్కడ భారీగా హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Samayam Telugu preity zinta gets hitched to gene goodenough in los angeles
ప్రీతి జింతాకి పెళ్లయిపోయింది...


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.