యాప్నగరం

చెత్తలో మాణిక్యం.. రోజులో కోటీశ్వరుడు!

దారెంట వెళ్తూంటే.. కోట్ల రూపాయల విలువ చేసే డైమండ్ దొరికితే.. లేకపోతే పెరట్లో తవ్వుతూంటే పెద్ద మొత్తంలో గుప్త నిధులు బయటపడితే.. పట్టరాని సంతోషంతో ఎగిరి గంతేస్తాం కదా! పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉందిప్పుడు..

TNN 21 Aug 2017, 3:53 pm
దారెంట వెళ్తూంటే.. కోట్ల రూపాయల విలువ చేసే డైమండ్ దొరికితే.. లేకపోతే పెరట్లో తవ్వుతూంటే పెద్ద మొత్తంలో గుప్త నిధులు బయటపడితే.. పట్టరాని సంతోషంతో ఎగిరి గంతేస్తాం కదా! పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉందిప్పుడు. ఆ రాష్ట్రంలోని సిర్సా జిల్లాలోని దబ్వాలీ గ్రామానికి చెందిన గౌరీశంకర్ సీట్లు తయారు చేసి విక్రయించే వ్యాపారం చేస్తుంటాడు. ఆదాయం సరిపోక అతడు తన ఇంట్లో ఉన్న పాత సామగ్రి (స్క్రాప్) అమ్మేద్దామనుకున్నాడు.
Samayam Telugu punjab shopkeeper becomes millionaire after found a historic coin in junk
చెత్తలో మాణిక్యం.. రోజులో కోటీశ్వరుడు!


ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నింటినీ పోగు చేస్తుండగా.. అతడికి అందులో ఓ నాణెం కనిపించింది. శుభ్రం చేసి చూసినా.. దానిపై ఉన్న అక్షరాలెంటో అతడికి అర్థం కాలేదు. ఉర్దూ భాషలో ఏదో రాసి ఉన్నట్టు గుర్తించిన గౌరీశంకర్.. అదేంటో కనుక్కుందామని దగ్గర్లోని మసీదు వద్దకు వెళ్లాడు. దాన్ని పరిశీలించిన మసీదు ఇమామ్.. నాణెంపై ‘1450, మదీనా’ అని రాసున్నాయని, అది ఆ కాలానికి చెందిన అత్యంత అరుదైన నాణెమని తెలిపాడు.

వెంటనే గౌరీశంకర్ ఆ నాణేన్ని ఫోటో తీసి దుబాయ్‌లో ఉండే మిత్రుడికి పంపించాడు. విషయం తెలుసుకున్న దుబాయ్‌కి చెందిన ఓ వ్యక్తి దాన్ని ఇస్తే.. రూ. 1.5 కోట్లు చెల్లిస్తానని ముందుకొచ్చాడు. నాణెం విలువ తెలుసుకున్న గౌరీశంకర్.. ఇప్పుడు దాన్ని రూ. 3.5 కోట్లకు వేలానికి పెట్టాడు. మరి ఈ వార్త పురావస్తు శాఖ దగ్గరికి చేరితే.. ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.
Read this in Hindi

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.