యాప్నగరం

కుర్చీ ఖాళీగా ఉందని కూర్చున్నా..: రాధే మా

వివాదాల్లో చిక్కుకునే మోడరన్ బాబాలు, మాతాజీలు చెప్పే సమాధానాలు చాలా విచిత్రంగా ఉంటాయి.

TNN 6 Oct 2017, 4:09 pm
వివాదాల్లో చిక్కుకునే మోడరన్ బాబాలు, మాతాజీలు చెప్పే సమాధానాలు చాలా విచిత్రంగా ఉంటాయి. చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నామని వాళ్లు అనుకుంటారు గానీ.. అవి ఎంత వెటకారంగా ఉంటాయో అర్థం చేసుకోరు. ఢిల్లీలోని వివేక్ విహార్ పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్లిన ఆధ్యాత్మిక గురువు రాధే మా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సీట్లో కూర్చున్న ఘటన ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. రాధే మాను తన కుర్చీలో కూర్చోబెట్టి వినమ్రంగా ఫొటోకి పోజుచ్చిన ఆ ఆఫీసర్ ఇప్పుడు సస్పెండ్ అయ్యారు. తమ స్టేషన్‌ మీదుగా అనుచరులతో వెళ్తున్న రాధే మా.. వాష్‌రూమ్‌ను ఉపయోగించుకొనేందుకు లోపలికి వచ్చారని, ఆమె తన కుర్చీలో కూర్చున్న విషయాన్ని గమనించలేదని సదరు పోలీస్ అధికారి వివరణ ఇచ్చారు. అయినప్పటికీ డిపార్ట్‌మెంట్ ఆయన్ని కనుకరించలేదు.
Samayam Telugu radhe maa defends sho says she went there to use loo sat on seat by mistake
కుర్చీ ఖాళీగా ఉందని కూర్చున్నా..: రాధే మా


ఈ విషయంపై రాధే మాను మీడియా ప్రశ్నించగా.. ఆమె చిత్రవిచిత్రమైన సమాధానాలు ఇచ్చారు. ‘వాష్‌రూం వాడుకోవడానికని పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లాను. అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీ కనిపించడంతో అందులో కూర్చున్నాను. అది ఎస్‌హెచ్‌వో సీట్ అని నాకు తెలీదు’ అని రాధే మా చెప్పుకొచ్చారు. ఎస్‌హెచ్‌వో రెండు చేతులు జోడించి చాలా మర్యాదగా తనను కుర్చీ ఖాళీ చేయమని చెప్పారని రాధే మా వెల్లడించారు. ‘నేనెవరో ఆయన(ఎస్‌హెచ్‌వో)కు తెలీదు. ఢిల్లీ పోలీసులను గానీ, ఎస్‌హెచ్‌వోను గానీ అగౌరవపరిచే ఉద్దేశం నాకు లేదు’ అని రాధే మా చెప్పారు.

అలా కూర్చుంటే తప్పేంటి..
రాధే మా పోలీస్ స్టేషన్ వివాదంపై ఆమె సంరక్షుడు సంజీవ్ గుప్తా స్పందించారు. టాయిలెట్ ఉపయోగించడం కోసం పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లిన రాధే మాను పోలీసులు గౌరవించడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆమె మా అందరికీ అమ్మ. ఆమెను గౌరవించడంతో ఎలాంటి తప్పూ లేదు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం దురదృష్టకరం అని సంజీవ్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.