యాప్నగరం

హీరోయిన్ ఛాన్సిస్తామని.. కార్లో తీసుకెళ్లి..

తాము రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తామని చెప్పి.. తనను తీసుకెళ్లి

TNN 16 Aug 2017, 8:28 am
తాము రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తామని చెప్పి.. తనను తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశారని... ఒక వర్ధమాన నటి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చలపతి అనే దర్శకుడి మీద, సృజన్ అనే హీరో మీద ఆమె కంప్లైంట్ ఇచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. తను సినిమా అవకాశాల ప్రయత్నంలో ఉన్న వర్ధమాన నటి. ఈ నేపథ్యంలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తామని.. చలపతి, సృజన్ లు ఆమెకు పరిచయం అయ్యారు. షూటింగ్ కోసం తనను హైదరాబాద్ నుంచి భీమవరం తీసుకెళ్తామని సోమవారం రాత్రి కారు ఎక్కించారు.
Samayam Telugu rape attempt on upcoming actress
హీరోయిన్ ఛాన్సిస్తామని.. కార్లో తీసుకెళ్లి..


కారులో ఆమెతో వారు అనుచితంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. చలపతి, సృజన్ ఇద్దరూ కూడా ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు. దీనికి బాధితురాలు ప్రతిఘటించింది. కారులో ఈ గలాభా కొంతసేపు కొనసాగింది. దీంతో కారు బ్యాలెన్స్ తప్పింది.. పక్కగా వెళ్తున్న ఒక లారీని ఢీ కొంది. ఆ ప్రమాదంలో తనకు గాయాలు తగిలాయని.. దీంతో తనను విజయవాడలోని ఒక ఆసుపత్రిలో అడ్మిట్ చేసి వారు వెళ్లిపోయారని బాధితురాలు చెబుతోంది.

జరిగిన ఘటన గురించి తను తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చానని, వారు వచ్చిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా పేర్కొంది. చలపతి, సృజన్ లిద్దరూ పరారీలో ఉన్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.