యాప్నగరం

పండ్లకు, పాటలకు కూడా రేషన్ కార్డులు

మోసానికి, దోపిడీకి నిలువెత్తు నిదర్శనంలాంటిది ఈ ఘటన.

TNN 28 Mar 2017, 11:29 am
మోసానికి, దోపిడీకి నిలువెత్తు నిదర్శనంలాంటిది ఈ ఘటన. ఏకంగా పండ్ల పేరు మీద, హిందీ పాటల పేరు మీద కూడా రేషన్ కార్డులు సృష్టించి పప్పులు, ఉప్పులను పక్కదారి పట్టించేస్తున్నాడు ఓ రేషన్ డీలర్. ఆగ్రాలోని ఫతేబాద్ తాలూకా నిభోరా గ్రామంలో రేషన్ షాపును నిర్వహిస్తున్నాడు పదమ్ సింగ్. కాగా రెండేళ్ల నుంచి వచ్చిన రేషన్ ఊళ్లో ఉన్న ఒక్కరికీ ఇవ్వడం లేదు. దీంతో భగ్వాన్ అనే వ్యక్తి విషయాన్ని చాలా సార్లు అడిగాడు. ఎప్పుడడిగినా రేషన్ అయిపోయిందనే చెప్పేవాడు పదమ్ సింగ్. దీంతో అతనిపై ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. అయిన రెండేళ్ల నుంచి ఏ అధికారి పదమ్ సింగ్ పై చర్యలు తీసుకోలేవు. ఫిర్యాదులు ఇచ్చినా పోలీసులు కూడా పట్టించుకోలేదు. అయితే మొన్న యూపీలో పాత ప్రభుత్వం పోయి... కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో పరిస్థితులు మారాయి. వెంటనే అధికారులు చర్యలు తీసుకున్నారు. పదమ్ సింగ్ పై విచారణ జరిపి అతని లైసెన్సు రద్దు చేశారు. ఆ విచారణలో అనేక ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. పదమ్ సింగ్ ఎంత దారుణంగా సర్కారీ సొమ్మును పక్కదారి పట్టించాడో బయటపడ్డాయి.
Samayam Telugu ration cards have names from bollywood songs vegetables in up village
పండ్లకు, పాటలకు కూడా రేషన్ కార్డులు


పదమ్ సింగ్ 350 బోగస్ రేషన్ కార్డులను సృష్టించాడు. ఆ రేషన్ కార్డుల్లో పేర్లు పండ్లకు చెందినవి, హిందీ పాటలు పెట్టేశాడు. హవాస్ అనే పాత హిందీ సినిమాలో ‘తేరి గలియాన్ మే నా రఖేంటే కదమ్’ అనే పాట ఉంటుంది. ఆ వాక్యంలోని పదాలతో ఓ ఫ్యామిలీని సృష్టించేశాడు. తేరి అనే వ్యక్తి, ఆ వ్యక్తి తల్లిగా ‘గలియాన్’, మేనా అనే కొడుకు, కేబాద్ అనే తండ్రి, ఆజ్ అనే కూతురు ఇలా అన్నమాట. అలాగే మనోహర్ సింగ్ అనే వ్యక్తిపై రేషన్ కార్డు సృష్టించాడు. అతని కుటుంబంలోని వ్యక్తులుగా ఆలూ, లోకి, భిండి, బైగాన్, బాదం, పిస్తా పేర్లను నమోదు చేశారు. అలాగే మరో కుటుంబంలో సభ్యులుగా నారియల్, ఆక్రోట్, సుపారి, లాంగ్ ఇలా నచ్చిన పేర్లను పెట్టి రేషన్ కార్డులు సృష్టించాడు. రెండేళ్ల నుంచి రేషన్ ను మొత్తం దొంగదారిలో తీసుకెళ్లి మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోసాగాడు. ఇప్పుడు అతని పాపం పండి అధికారులకు దొరికాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.