యాప్నగరం

24 ఏళ్లుగా మహిళ పోరాటం.. హైకోర్టు క్షమాపణలు!

న్యాయం కోసం 24 ఏళ్లుగా పోరాడుతున్న ఓ మహిళకు మద్రాస్ హైకోర్టు క్షమాపణలు చెప్పింది.

TNN 6 Aug 2017, 2:57 pm
న్యాయం కోసం 24 ఏళ్లుగా పోరాడుతున్న ఓ మహిళకు మద్రాస్ హైకోర్టు క్షమాపణలు చెప్పింది. తీర్పు కోసం ఓ మహిళను 24 ఏళ్లుగా వేచిచూసేలా చేసినందుకు చింతుస్తున్నామని కోర్టు వ్యాఖ్యానించింది. 1993లో మరణించిన తన కుమారుడి పరిహారం కోసం అప్పటినుంచి ఆమె అలుపెరుగని న్యాయ పోరాటం చేస్తోంది. చివరికి న్యాయమే గెలిచింది. లారీకి ఇన్సూరెన్స్ ఇచ్చిన కంపెనీ పరిహారం చెల్లించి తీరాల్సిందేనని మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్. శేషసాయి తీర్పు వెల్లడించారు.
Samayam Telugu regret justice was delayed for 24 years high court tells woman
24 ఏళ్లుగా మహిళ పోరాటం.. హైకోర్టు క్షమాపణలు!


తమిళనాడుకు చెందిన బక్కియం‌ కుమారుడు లోకేశ్వరన్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీళ్లకి సొంత లారీ ఉంది. 1993 మే 18న జరిగిన రోడ్డు ప్రమాదంలో లోకేశ్వరన్ మరణించాడు. లోకేశ్వరన్ నడుపుతున్న లారీని ఎదురుగా వస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో లోకేశ్వరన్ అక్కడికక్కడే మరణించాడు. లారీకి ఇన్సూరెన్స్ ఇచ్చిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు బక్కియం దరఖాస్తు చేసుకుంది. అయితే దీనికి ఆమె మోటార్ వాహన చట్టం కింద పరిహారం కోరకుండా వర్క్‌మెన్స్ పరిహార చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఆ క్లెయిమ్‌కు ఇన్సూరెన్స్ కంపెనీ నిరాకరించింది. ఈ చట్టం కేవలం పారిశ్రామిక ప్రమాదాలకే వర్తిస్తుందని వివరణ ఇచ్చింది.

దీంతో బాధితురాలు మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద రూ. 5 లక్షలు పరిహారం చెల్లించాలని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. అయితే ఆమె తొలుత వర్క్మెన్స్ పరిహార చట్టం కింద దరఖాస్తు చేసినందున, తిరిగి మోటార్ యాక్ట్ కింద పరిహారం చెల్లించలేమని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాదించింది. కంపెనీ అభ్యంతరాన్ని తోసిపుచ్చిన ట్రిబ్యునల్ రూ 3.47 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ అప్పీల్ను తోసిపుచ్చిన హై కోర్టు జడ్జి.. బాధిత మహిళకు నాలుగు వారాల్లో పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.