యాప్నగరం

సచిన్ కుమార్తె.. అతనికి అంత పెద్ద అభిమానా?

సచిన్ టెండూల్కర్ కూతురు పాపులర్ పాప్ సింగర్‌ జస్టిన్ బైబర్‌పై మనసు పారేసుకుంది. ఎంతగా అంటే, అతని షోలో కలిసి కనిపించాలని కలలుగనేంత. ఔను, మరి తన అభిమాన పాప్ సింగర్ తొలిసారిగా ఇండియాకు వచ్చి పెద్ద షో ఇస్తున్నాడని తెగ సంబరపడిపోయింది.

TNN 11 May 2017, 7:55 pm
చిన్ టెండూల్కర్ కూతురు పాపులర్ పాప్ సింగర్‌ జస్టిన్ బైబర్‌పై మనసు పారేసుకుంది. ఎంతగా అంటే, అతని షోలో కలిసి కనిపించాలని కలలుగనేంత. ఔను, మరి తన అభిమాన పాప్ సింగర్ తొలిసారిగా ఇండియాకు వచ్చి పెద్ద షో ఇస్తున్నాడంటే ఆ ఆశ ఎవరికి ఉండదు. ఈ సందర్భంగా అతడితో సెల్ఫీ దిగిన ఓ ఫోటోను ఆమె ట్విట్టర్‌లో పెట్టింది. ఇంకేముందు అది వైరల్‌గా మారి... ఆమె జస్టిన్ షోలో కనిపించనుందనే ప్రచారం ఊపందుకుంది.
Samayam Telugu sachin tendulkars daughter sara huge fan of justin bieber
సచిన్ కుమార్తె.. అతనికి అంత పెద్ద అభిమానా?


వాస్తవానికి ఆ ఫొటో ఇప్పటిది కాదు కొద్ది నెలల కిందట తీసుకున్న సెల్ఫీ. జస్టిన్ బైవర్ అంటే సరాకు ఎంతో అభిమానం. దీంతో.. అతడి షోలకు తప్పకుండా హాజరువుతుంది. అయితే, ఆమె అంతగా అతన్ని అభిమానించడం వెనక కారణం తన సోదరుడు అర్జున్ టెండూల్కర్ అనే ప్రచారం జరుగుతోంది.

ఎందుకంటే అర్జున్ కూడా చూసేందుకు అచ్చం జస్టిన్ బైబర్‌లా ఉంటాడట. ఇద్దరిని పక్కన పెడితే కవల పిల్లల్లా ఉంటారట. అందుకే, సరాకు జస్టిన్‌పై అభిమానం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని సరా కొట్టి పడేసింది. పాప్ సింగర్‌గా మాత్రమే తనను అభిమానిస్తున్నానని స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.