యాప్నగరం

డేటింగ్‌లో సైఫ్ కూతురు?

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమ్రితా సింగ్.

TNN 7 May 2016, 2:30 pm
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమ్రితా సింగ్. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్బాయి ఇబ్రహీం అలీ ఖాన్, అమ్మాయి సారా అలీ ఖాన్. ఇద్దరూ టీనేజీలోనే ఉన్నారు. సెలెబ్రిటీల పిల్లలు ఏంచేసినా అది ఆసక్తిగానే ఉంటుంది. అలాంటిది వాళ్లు ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నారని తెలిస్తే... ఆ వ్యక్తెవరో తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సైఫ్ కూతురు సారా అలీఖాన్ కూడా డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పెట్టింది. అది ఇప్పుడు వైరల్ అయింది. ఓ అబ్బాయి మెడచుట్టూ చేయి వేసిన ఆ ఫోటో సారా డేటింగ్ లో ఉన్నదన్న వార్తలకు బలం చేకూర్చింది. ఫోటోలో ఉన్న అబ్బాయి కూడా ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని పేరు వీర్ పహారియా. మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. ఫోటోకి సారా పెట్టిన క్యాప్షన్ కూడా అందరినీ ఆకర్షిస్తోంది. వీర్ చాలా సెన్సిటివ్ గా ఉండే వ్యక్తని, బీచ్ లో చేయి పట్టుకుని నడవాలనిపించే కుర్రాడని పేర్కొంది.
Samayam Telugu saif ali khans daughter dating top politicians grandson
డేటింగ్‌లో సైఫ్ కూతురు?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.