యాప్నగరం

స్నాప్ చాట్ వాడిందని పెళ్లయిన రెండు గంటలకే విడాకులు!

సోషల్ మీడియా ద్వారా భార్య తమ పెళ్లి ఫొటోలు ఫ్రెండ్స్‌కు పంపిందనే కారణంతో ఓ భర్త ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.

TNN 25 Oct 2016, 3:09 pm
పెళ్లిళ్లు పెటాకులు కావడంలో ప్రపంచంలోనే సౌదీ అరేబియా ముందు వరుసలో ఉండేలా ఉంది. సౌదీలో విడాకులకు వెళ్తున్న జంటల్లో 50 శాతం కొత్త జటలే ఉంటున్నాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలతో యువ జంటలు విడాకుల కోసం కోర్టు మెట్లకెత్తున్నాయి. కట్టుకున్న మొగుడి కంటే ఫ్రెండ్స్‌తో సోషల్ మీడియాలో చాటింగే ముఖ్యమని ఓ భార్య, మేకప్ లేకుండా భార్యను గుర్తుపట్టలేకపోయానంటూ మరో వ్యక్తి డైవర్స్ తీసుకున్న ఘటనలు మరువక ముందే.. పెళ్లి ఫొటోలను ఫ్రెండ్స్‌కు పంపిన పాపానికి వివాహమై రెండు గంటలు గడవక ముందే ఓ భర్త విడాకులకు దరఖాస్తు చేశాడు.
Samayam Telugu saudi groom divorces his wife just two hours after their wedding
స్నాప్ చాట్ వాడిందని పెళ్లయిన రెండు గంటలకే విడాకులు!


తమ పెళ్లి ఫొటోలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని వివాహానికి ముందే ఆ జంట ఒక ఒప్పందానికి వచ్చింది. కానీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిన భార్య తన స్నేహితురాళ్లకు స్నాప్ చాట్ ద్వారా పెళ్లి ఫొటోలను పంపడంతో కోపం వచ్చిన ఆ భర్త విడాకులకు దరఖాస్తు చేశాడు. ‘సోషల్ మీడియా యాప్స్ ఏవీ ఉపయోగించబోనని పెళ్లికి ముందే నా చెల్లెలు కాబోయే భర్తతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీన్ని మ్యారేజ్ కాంట్రాక్టులోనూ చేర్చారు. కానీ మా చెల్లెల్లు మాట మీద నిలబడకుండా స్నాప్ చాట్ ద్వారా ఫొటోలను షేర్ చేసింది. ఫలితంగానే మా బావ పెళ్లిని రద్దు చేసుకోవడం కోసం విడాకులకెళ్లాడు’ అని పెళ్లి కూతురి సోదరుడు చెప్పుకొచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే ఇండియానే బెటర్ అనిపిస్తోంది. భార్య తనకు నచ్చిన సీరియళ్లు చూస్తున్నా.. షాపింగ్‌ల కోసం వేలకు వేలు తగలేస్తున్నా ఓ భర్తగా బాధపడటం మినహా మనోళ్లు ఇంకా ఏం చేయలేకపోతున్నారు. భర్తలు తాగొచ్చి చితకబాదినా ఆడవాళ్లు గుట్టుగా కాపురం చేస్తున్నారు. మనోళ్లకు, ఇతర దేశీయులకు ఎంత తేడానో కదూ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.