యాప్నగరం

తొలి ఫొటో.. అలెక్సిస్ D/o సెరెనా

ఇటీవలే తల్లి అయిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. తన కూతురిని తొలిసారి బాహ్య ప్రపంచానికి చూపించింది.

TNN 14 Sep 2017, 12:54 pm
ఇటీవలే తల్లి అయిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. తన కూతురిని తొలిసారి బాహ్య ప్రపంచానికి చూపించింది. పాపతో తీసుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఉంచింది. రెడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియన్‌తో సహజీవనం చేస్తున్న 35 ఏళ్ల సెరెనా సెప్టెంబర్ 1న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. పాపకు అలెక్సిస్ ఒలింపియా ఒహానియన్ జూనియర్ అని పేరు పెట్టినట్లు సెరెనా ప్రకటించింది. హాస్పిటల్‌లో మొత్తం ఆరు రోజులు ఉన్నట్లు తెలిపింది. తను గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు జన్మనించేంత వరకు జరిగిన పరిణామాలపై సెరెనా ఒక డాక్యుమెంటరీ కూడా రూపొందించింది. ఈ డాక్యుమెంటరీని కూడా బుధవారం విడుదల చేసింది.
Samayam Telugu serena williams shares first photos of baby girl alexis olympia ohanian jr
తొలి ఫొటో.. అలెక్సిస్ D/o సెరెనా


కాగా, తనకంటే రెండేళ్లు చిన్నవాడైన అలెక్సిస్ ఒహానియన్‌‌తో గతేడాది డిసెంబర్‌లో సెరెనా నిశ్చితార్థం జరిగింది. వీరింకా పెళ్లి చేసుకోలేదు. అయితే తాను 20 వారాల గర్భవతినని ఈ ఏడాది ఏప్రిల్‌లో సెరెనా ప్రకటించింది. స్నాప్‌ఛాట్‌ ద్వారా స్విమ్‌సూట్‌తో మరీ సెరెనా ఒక ఫొటోను ఉంచుంది. సెరెనా, ఒహానియన్ 2015 నుంచి డేటింగ్ చేస్తున్నారు. బిడ్డ పుట్టాకే పెళ్లిచేసుకోవాలని సెరెనా, అలెక్సిస్‌ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికి కూతురు పుట్టిన ఆనందంలో ఉన్న ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో వేచి చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.