యాప్నగరం

క్యాబ్ డ్రైవర్లకు రూ.58 కోట్ల నజరానా!

దుబాయ్ రాజు మరోసారి తన ఉదారతలను మరోసారి చాటుకున్నాడు. దుబాయ్ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమ్ టాక్సీ డ్రైవర్లకు తీపికబురు అందించారు.

TNN 21 May 2017, 1:07 pm
దుబాయ్ రాజు మరోసారి తన ఉదారతలను మరోసారి చాటుకున్నాడు. దుబాయ్ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమ్ టాక్సీ డ్రైవర్లకు తీపికబురు అందించారు. అయితే తమ ట్యాక్సీ నంబరులను దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్‌లోగాని, ట్యాక్సీ ఫ్రాంచైజీల్లో నమోదు చేయించిన డ్రైవర్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని షరతు విధించారు. ఇప్పటివరకు వీటిలో నంబర్లను నమోదు చేసుకున్న వారి సంఖ్య 6,657కు చేరిందని ఆయన అన్నారు. వారందరికీ దుబాయ్ ప్రభుత్వం తరపున 33.285 మిల్లియన్ ధీరామ్స్ అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.58,41,11, 856 నజరానాగా ఇవ్వనున్నట్లు షేక్ మహ్మద్ ప్రకటించారు.
Samayam Telugu sheikh mohammed announces bonus for taxi drivers
క్యాబ్ డ్రైవర్లకు రూ.58 కోట్ల నజరానా!


తమ దేశంలో ట్యాక్సీ డ్రైవర్ల ఆదాయం పరిమితంగానే ఉంటుంది కాబట్టి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకే ప్రధాని షేక్ మహ్మద్ ఈ నజరానాను ప్రకటించారని దుబాయ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ డైరెక్టర్ మక్తార్ అల్ టైర్ పేర్కొన్నారు. రంజాన్ మాసం ప్రారంభానికి ముందు దుబాయ్ రాజు మంచి నిర్ణయం తీసుకున్నారని ఇది ఆయన మంచితనానికి, తన ప్రజలపట్ల ఆయనకు ఉన్న అభిమానానికి నిదర్శనమని అల్ టైర్ కొనియడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.