యాప్నగరం

శక్తిమాన్ వ్యవహారం కోహ్లీని కూడా బాధించింది

పోలీస్ గుర్రం శక్తిమాన్‌పై దాడి ఘటనపై భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు

TNN 18 Mar 2016, 5:27 pm
పోలీస్ గుర్రం శక్తిమాన్‌పై దాడి ఘటనపై భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. ఆ ఘటనపై తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం బీజేపీ ఈ నెల 14వ తేదీన డెహ్రాడూన్లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ ఎమ్మెల్యే గణేశ్ జోషి శక్తిమాన్‌పై అమానుషంగా తన ప్రతాపాన్ని చూపి కాలు విరిగేలా హింసించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పుణ్యమా అంటూ ఆ గుర్రం తన కాలును పోగొట్టుకుని అవిటిదైపోయింది. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ప్రజల నుండి ఆవేదన వ్యక్తమైంది. విరాట్ కోహ్లీ కూడా ఈ ఘటన తనను అమితంగా బాధించిందని ట్వీట్ చేశాడు. ఆ అందమైన, సాధు జంతువుపై దాడి చేయడాన్ని మించిన దారుణం ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు. ఆ చర్యను ఒక పిరికిపంద చర్యగా వ్యాఖ్యానించాడు. శక్తిమాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భగవానుడిని ప్రార్థిస్తున్నానన్నాడు. సదరు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని ట్వీట్లో పేర్కొన్నాడు.
Samayam Telugu shocked and disgusted over the unprovoked attack on shaktimaan virat kohli
శక్తిమాన్ వ్యవహారం కోహ్లీని కూడా బాధించింది


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.