యాప్నగరం

ఫార్మాలిటీస్ ఫాం నింపేలోగా.. ప్రాణాలు వదిలిన చిన్నారి

మానవత్వానికి మచ్చలాంటి ఘటన. ఫార్మాలిటీస్ ఫాం నింపాలంటూ క్యూలో నిలబెట్టడం వల్ల ఓ నిండు ప్రాణం బలైపోయింది.

TNN 18 Oct 2017, 6:23 pm
ఆరోగ్య పరిస్థితి విషమించిన పాపను చికిత్స కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్తే.. ఫార్మాలిటీస్ పేరిట ప్రాణం తీశారు. ఈ ఉదంతం పాట్నాలోని ఎయిమ్స్‌లో చోటు చేసుకుంది. రోషన్ కుమారి అనే చిన్నారి ఆరు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. దీంతో ఆమె తండ్రి రామ్‌బాలక్ ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. వెంటనే చికిత్స అందించాల్సిన వైద్యులు.. ఫార్మాలిటీస్ ఫాం నింపాలని సూచించారు.
Samayam Telugu shocking apathy at bihars patna aiims girl first denied treatment then an ambulance when she died
ఫార్మాలిటీస్ ఫాం నింపేలోగా.. ప్రాణాలు వదిలిన చిన్నారి


పాప పరిస్థితి విషమంగా ఉందని భార్య వచ్చి రామ్ బాలక్‌తో చెప్పింది. క్యూలో ఎక్కువ మంది ఉండటంతో.. వారి కంటే ముందు ఈ దరఖాస్తు తీసుకోండని కౌంటర్లో కూర్చున్న క్లర్క్‌ను ఆ త్రండి బతిమాలాడు. కానీ అతడి మనసు కరగలేదు. దీంతో తన వంతు వచ్చే దాకా ఆగి దరఖాస్తు ఇచ్చి వచ్చేలోగా.. తల్లి ఒడిలో ఆ చిన్నారి ప్రాణాలు వదిలింది.

లకిసరయ్ జిల్లా క్రజా గ్రామానికి చెందిన రామ్ బాలక్ దినసరి కూలీ. రెక్కాడితే గానీ డొక్కాడదు. చేతిలో డబ్బులు లేకపోవడంతో.. కూతురి శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సమకూర్చాలని ఎయిమ్స్ అధికారులను కోరాడు. కానీ వారు స్పందించలేదు. దీంతో నిర్జీవంగా పడి ఉన్న బిడ్డను భుజం మీద మోస్తూ నాలుగు కి.మీ. నడిచివెళ్లి ఆటో ఎక్కాల్సి వచ్చింది.

పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తమకు తెలియదని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ముందుగా చికిత్స కోసం చేరి.. తర్వాత ఫార్మాలిటీస్ ఫాం నింపొచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ సంఘటన విషయమై దర్యాపు జరుపుతామన్నారు. ఈ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డ్ లేకపోవడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.