యాప్నగరం

స్కూల్ ఫీజు కట్టలేదని బాలికల బట్టలూడదీసి....

ప్రైవేట్ పాఠశాలల ధన దాహానికి అడ్డుఅదుపు లేకుండా పోతుంది. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకు తాగే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం దాష్టీకం మరోసారి బయటపడింది.

TNN 18 Jun 2017, 2:18 pm
ప్రైవేట్ పాఠశాలల ధన దాహానికి అడ్డుఅదుపు లేకుండా పోతుంది. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకు తాగే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం దాష్టీకం మరోసారి బయటపడింది. స్కూల్ ఫీజు కట్టలేదని బాలికలకు అమానవీయ రీతిలో శిక్ష వేశారు. బాలికల తండ్రి ఫీజు చెల్లించకపోవడతంతో వారి దుస్తులు విప్పించి అందరి ముందు నిలబెట్టి, వీధుల్లో నడిపించారు. అత్యంత హేయమైన ఈ ఘటన బిహార్‌లోని బెగుసరాయ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై సభ్య సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పేద కుటుంబానికి చెందిన చున్‌చున్‌షా అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్చించాడు. వీరిలో ఒకరు ఒకటో తరగతి, ఇంకొకరు నర్సరీలో చేరారు.
Samayam Telugu sisters stripped allegedly by bihar school after father fails to pay fee
స్కూల్ ఫీజు కట్టలేదని బాలికల బట్టలూడదీసి....


అయితే వారి యూనిఫాం, షూ, స్కూల్‌ ఫీజులకు సరిపడా డబ్బు లేకపోవడంతో పాఠశాల యాజమాన్యాన్ని చెల్లించడానికి కొంత సమయం కోరాడు. ఆయన విన్నపాన్ని పట్టించుకోని స్కూల్‌ యాజమాన్యం అమానుష చర్యకు పాల్పడింది. శుక్రవారం అందరూ చూస్తుండగానే ఓ టీచర్‌ ఆ ఇద్దరు పిల్లల దుస్తులను విప్పించి బయటకు తోసేశాడు. ఏడ్చుకుంటూ వీధుల వెంట నడుస్తోన్న ఆ చిన్నారులను చూసి చలించిపోయిన ఓ వ్యక్తి వారిని అక్కునచేర్చుకుని దుస్తులు ఇచ్చాడు. ఈ ఘటనపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్కూల్‌ ప్రిన్సిపాల్‌‌తోపాటు టీచర్‌, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటన బిహార్‌ రాజధాని పట్నాకు 125 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకోవడం గమనార్హం. ఇలాంటి ఘటనలు ఆ రాష్ట్రంలో నిత్యకృత్య‌ం. అంతేకాదు అప్పుడప్పుడు ఆత్మహత్యలు కూడా చోటు చేసుకుంటాయి.

గత జనవరిలోనూ హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. కాలేజీ ఫీజు చెల్లించలేదనే కారణంతో యాజమాన్యం వేధించడంతో ఓ 16 ఏళ్ల బాలుడు అత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఫీజు కట్టలేదని ఆరో తరగతి విద్యార్థిని పరీక్ష రాయనీయకుండా బయట నిలబెట్టిన ఘటన అప్పట్లో సంచలనమైంది. గత అక్టోబరులోనూ 14 ఏళ్ల బాలుడు దీని కారణంగానే అత్మహత్యకు పాల్పడ్డాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.