యాప్నగరం

ఈ కారు చెట్టెలా ఎక్కిందబ్బా?!

రోడ్డు మీద వెళ్లాల్సిన కారు.. ఇదిగో ఇలా చెట్టెక్కి కూర్చొంది. కారు మందు కొట్టి అలా చెట్టు ఎక్కేసి ఉంటుందేమో అని కొంటెగా ఆలోచిస్తున్నారా?

Samayam Telugu 15 Oct 2017, 3:52 pm
రోడ్డు మీద వెళ్లాల్సిన కారు.. ఇదిగో ఇలా చెట్టెక్కి కూర్చొంది. కారు మందు కొట్టి అలా చెట్టు ఎక్కేసి ఉంటుందేమో అని కొంటెగా ఆలోచిస్తున్నారా? ఇందులో పాపం ఆ కారు తప్పమీ లేదు. దాన్ని నడిపిన యజమానిదే ఆ తప్పంతా. చైనాలోని సుహువా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదుగురు వ్యక్తులు ఎక్స్‌ప్రెస్ వేపై ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్నారు.
Samayam Telugu speeding suv runs into trees in northeast china
ఈ కారు చెట్టెలా ఎక్కిందబ్బా?!


ఎక్స్‌ప్రెస్ వే కదా, స్పీడుగా వెళ్లాలని అనుకున్నాడో ఏమో.. ఎస్కలేటర్‌ను అదే పనిగా తొక్కేశాడు. ఇంకేముంది, మధ్యదారిలో ఎస్‌యూవీ బ్యాలెన్స్ తప్పి గాల్లోకి లేచింది. నేరుగా వెళ్లి చెట్ల మధ్యలో ఇరుక్కుంది. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. ఈ కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్వల్ప గాయాలతో ప్రాణగండం నుంచి తప్పించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.