యాప్నగరం

మన పతంగులు వన్యప్రాణులకు శాపం కావొద్దు..

మనం సరదా కోసం చేసే చర్యలు వన్యప్రాణుల పాలిట శాపంగా మారుతున్నాయి. పతంగి దారం ఉరితాడుగా మారి ఓ పక్షి మృత్యువాతపడింది. పతంగి దారానికి చిక్కుకొని బయటపడే మార్గంలేక గిలగిలా కొట్టుకొని ఓ గబ్బిలం పిల్ల దుర్మరణం పాలైన ఘటన భువనేశ్వర్‌లో మంగళవారం (డిసెంబర్ 5) వెలుగు చూసింది.

TNN 5 Dec 2017, 3:50 pm
మనం సరదా కోసం చేసే చర్యలు వన్యప్రాణుల పాలిట శాపంగా మారుతున్నాయి. పతంగి దారం ఉరితాడుగా మారి ఓ పక్షి మృత్యువాతపడింది. పతంగి దారానికి చిక్కుకొని బయటపడే మార్గంలేక గిలగిలా కొట్టుకొని ఓ గబ్బిలం పిల్ల దుర్మరణం పాలైన ఘటన భువనేశ్వర్‌లో మంగళవారం (డిసెంబర్ 5) వెలుగు చూసింది. ఓ చెట్టుకు చిక్కుకొని విలవిల్లాడుతున్న ఆ చిరుప్రాణిని కాపాడటానికి వన్యప్రాణి సంరక్షులు విఫలయత్నం చేశారు. స్నేక్ హెల్ప్‌లైన్ వలంటీర్లు భారీ పోల్స్ సాయంతో చెట్టు కొమ్మల్లో చిక్కుకున్న గబ్బిలం పిల్లను జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చారు. కానీ, ఆ ప్రాణి అప్పటికే మృతి చెందింది. అలాంటి మందమైన పతంగి దారాలపై హైకోర్టు నిషేధం విధించినా.. మార్కెట్లో విరివిగా అమ్మేస్తున్నారు.
Samayam Telugu spotted owlet gets tangled in kite string dies in bhubaneswar
మన పతంగులు వన్యప్రాణులకు శాపం కావొద్దు..


సంక్రాంతి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ పతంగుల సందడి మొదలైంది. పతంగి దారాలు చుట్టుకోవడం వల్ల బైకర్లు కూడా ప్రమాదాలకు గురై దుర్మరణం పాలైన ఉదంతాలు గతంలో ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.