యాప్నగరం

కనని బిజినెస్‌ఉమెన్‌గా నిలబెట్టిన బతుకు పోరాటం

పేదరికం ఆమెని కష్టాల్లోకి నెడితే, ఆ కష్టాల కడలిలోనే ఆమె విజయతీరాలకి చేరుకుంది. 15 ఏళ్ల ప్రాయంలోనే తండ్రి రహ్మాన్‌ని కోల్పోయిన...

Ei Samay 8 May 2017, 4:52 pm
పేదరికం ఆమెని కష్టాల్లోకి నెడితే, ఆ కష్టాల కడలిలోనే ఆమె విజయతీరాలకి చేరుకుంది. 15 ఏళ్ల ప్రాయంలోనే తండ్రి రహ్మాన్‌ని కోల్పోయిన కన తనకి చేతనైనంత మేరలో తల్లికి చేదోడువాదోడుగా నిలుద్దామనుకున్నారు. ఆ ఆలోచనే ఆమెని ఇవాళ సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యువర్‌ని చేసింది. కడు పేదరికంతో 21 ఏళ్లు పోరాటం చేసిన కన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం కింద 3,000 మంది మహిళలకి కుట్లు, అల్లికలు నేర్పుతూ వారిని నైపుణ్యంగలవారిగా తీర్చిదిద్దుతున్నారు.
Samayam Telugu struggle for life makes a poor woman to become a successful businesswoman
కనని బిజినెస్‌ఉమెన్‌గా నిలబెట్టిన బతుకు పోరాటం


పశ్చిమబెంగాల్‌లోని దేగంగకి సమీపంలోని మారుమూల పల్లెటూరైన అమీన్‌పూర్‌కి చెందిన కన అనే మహిళ సక్సెస్ స్టోరీ ఇది. తన 15వఏటనే తండ్రిని కోల్పోయిన కన అప్పటి రాష్ట ప్రభుత్వం నెలకి రూ.200 కనీస ఫీజుతో కుట్లు, అల్లికల్లో శిక్షణ ఇస్తున్నారని తెలిసి 6 నెలలపాటు ఆ కోర్సు శిక్షణ తీసుకున్నారు. అనంతరం ఓ బ్యాంక్ ద్వారా రూ.1 లక్ష ఆర్థిక సహాయం తీసుకుని సొంతంగా వ్యాపారం మొదలుపెట్టారు కన.

1999లో అచెన(గుర్తుతెలియని) పేరిట ఓ స్వయం సహాయక బృందాన్ని ఏర్పాటు చేసుకుని తనకి తెలిసిన విద్యనే గ్రామీణ మహిళలకి నేర్పారు. అప్పటివరకు చైతన్యం అంటే ఏంటో తెలియని ఆ గ్రామీణ మహిళలకి తమ కాళ్లపై తాము ఎలా నిలబడాలో నేర్పించారు. వారు తయారు చేసే ఉత్పత్తులని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ప్రదర్శనల్లో మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు. క్రమక్రమంగా కన స్థాపించిన వ్యాపారం కూడా అదేవిధంగా పెరుగుతూ వచ్చింది. ఓవైపు బిజినెస్ చూసుకుంటూనే మరోవైపు దేగంగ ఆదర్శ బాలికా విద్యాలయం నుంచి 10వ తరగతి పాస్ అయ్యారామె.

ఓ హిందూ యువకుడిని పెళ్లి చేసుకుని నార్త్ 24 పర్గనాస్‌లో తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. ఇంతటి బిజీ షెడ్యూల్లోనూ 200 గ్రామాల మహిళలకి శిక్షణ ఇచ్చిన కన 2009లో 11 స్వయం సహాక మహిళా బృందాలు ఏర్పాటు చేసి వారు తయారు చేసే జూట్ ఫైల్స్, కవర్లు, ఫ్యాన్సీ డ్రెస్సులని మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు.

కష్టాన్ని గట్టెక్కేందుకు ఆమె స్థాపించిన వ్యాపారం ఇప్పుడు ఏడాదికి రూ.37 లక్షల టర్నోవర్ సొంతం చేసుకుంటోంది. కుటీర పరిశ్రమల విభాగంలో కనకి ఎన్నో అవార్డులు వరించాయి. 2015లో జానకీ దేవి అవార్డ్ సొంతం చేసుకున్న కన.. 2017లో సీఐఐ ఫౌండేషన్ ఫైనల్ సెలక్షన్స్‌కి నామినేట్ అవడమేకాకుండా ఏప్రిల్ 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా అవార్డ్ అందుకున్నారు.
CLICK HERE TO READ THIS ARTICLE IN BENGALI ALSO :
http://eisamay.indiatimes.com/city/s24pargana/kana-mandal-fought-in-the-face-of-difficult-poverty/articleshow/58569132.cms

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.