యాప్నగరం

ఎఫ్‌బీలో సూసైడ్ నోట్ పెట్టి... ఆత్మహత్య

ఓ విద్యార్థి ఫేస్ బుక్ లో సూసైడ్ నోట్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.

TNN 3 Nov 2016, 7:33 pm
ఓ విద్యార్థి ఫేస్ బుక్ లో సూసైడ్ నోట్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కొందరు నెటిజన్లు ఆ ఆత్మహత్య లేఖకు కూడా లైకులు కొట్టారు. లేఖలో ఏం రాశావో అర్థం కాలేదంటూ కామెంట్లు పెట్టారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.
Samayam Telugu student posts suicide letter in facebook before committing suicide
ఎఫ్‌బీలో సూసైడ్ నోట్ పెట్టి... ఆత్మహత్య


ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో హేమారావు బీఎస్సీ మూడో ఏడాది చదువుతున్నాడు. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం తన ఫేస్ బుక్ అకౌంట్లో సూసైడ్ నోట్ అప్ లోడ్ చేశాడు. అనంతరం ఇంటి నుంచి గుడికి వెళ్తున్నానంటూ బయటికి వెళ్లాడు. వెళ్లిన వాడు తిరిగి రాలేదు. భీమడోలు వద్ద అతని మృతదేహం తేలింది. సైకిల్ ఏలూరు రైల్వే స్టేషన్లో ఉంది. చదువులో ముందుండే హేమారావు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడో తెలియలేదు.

ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసిన లెటర్ లో అక్షరాలు అర్థంకావడంలేదు. దీంతో అసలు కాపీ కోసం పోలీసులు వెతికారు. ఆ కాగితాలు దొరకలేదు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సూసైడ్ నోట్ కు అతని అకౌంట్లో ఉన్న కొందరు స్నేహితులు లైకులు కొట్టడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.