యాప్నగరం

స్నేహితుడి ప్రాణాలని కాపాడిన స్టూడెంట్

స్కూల్ క్యాంటీన్‌లో భోజనం చేస్తున్నప్పుడు ఓ స్నేహితుడు వేసిన జోక్ మరో స్నేహితుడి ప్రాణాలు పోయే....

TNN 25 Mar 2017, 12:33 pm
స్కూల్ క్యాంటీన్‌లో భోజనం చేస్తున్నప్పుడు ఓ స్నేహితుడు వేసిన జోక్ మరో స్నేహితుడి ప్రాణాలు పోయేంత వరకు తీసుకొచ్చింది. స్నేహితుడు వేసిన జోక్‌కి నవ్వాపుకోలేకపోయిన విల్ ఓల్సన్ అనే స్టూడెంట్ నోట్లో ఆహారం వుండగానే నవ్వేందుకు ప్రయత్నించాడు. అయితే, నోట్లో ఆహారం వుండటంతో వున్నట్టుండి అతడికి ఊపిరి ఆడలేదు. గొంతు పట్టేసి శ్వాస తీసుకోవడం కష్టమవడంతో చుట్టూ వున్న స్నేహితులకి ఏం చేయాలో దిక్కుతోచలేదు.
Samayam Telugu student saving his friends life caught on school cafeterias cctv
స్నేహితుడి ప్రాణాలని కాపాడిన స్టూడెంట్


ఆపదలో వున్న స్నేహితుడిని రక్షించేందుకు ఏం చేయాలా అని ఒక స్టూడెంట్ చుట్టూ వెతుకుతుండగానే, ఇయాన్ బ్రౌన్ అనే మరో స్టూడెంట్ లేచి ప్రాణపాయస్థితిలో వున్న విల్ ఓల్సన్ వద్దకెళ్లాడు. ఓల్సన్‌ని వెనకనుంచి చెయ్యి వేసి, ముందు ఛాతి, పొట్ట భాగంపై గట్టిగా రెండు చేతులతో ఒత్తుతూ, విడిచిపెట్టడం చేశాడు. ఇయాన్ చేసిన ఈ చికిత్సతో ఆగిపోయిందనుకున్న శ్వాస మళ్లీ క్రమక్రమంగా ఆడటం మొదలైంది.

ఇటువంటి అత్యవసర సమయంలో ఇయాన్ కానీ అలా వ్యవహరించి వుండకపోయుంటే, ఓల్సన్ పరిస్థితి ప్రమాదంలో పడేదే. అందుకే తనని రక్షించిన ఇయాన్‌కి కృతజ్ఞతలు చెప్పకుండా వుండలేకపోయాడు ఓల్సన్. సమయస్పూర్తితో ఇయాన్ చూపిన తెగువ అక్కడి స్కూల్ క్యాంటీన్ సీసీటీవీల్లో రికార్డ్ అయింది. మూడు రోజుల క్రితం అమెరికాలోని విస్కన్సన్ సిటీలో చోటుచేసుకున్న ఈ ఘటనకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.