యాప్నగరం

జయలలితకు ‘సైకత’ నివాళి

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ‘సైకత’ నివాళి అర్పించారు.

TNN 6 Dec 2016, 7:41 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ‘సైకత’ నివాళి అర్పించారు. ఈ మేరకు పూరీ తీరంలో ఆమె సైకత శిల్పాన్ని నిర్మించారు. ఒడిశాకు చెందిన సుదర్శన్ పట్నాయక్ గతంలోనూ అబ్దుల్ కలాం వంటి గొప్ప నాయకులకు సైకత శిల్పాలతో నివాళులర్పించారు.
Samayam Telugu sudarsan pattnaik pays sand art tribute to jayalalitha
జయలలితకు ‘సైకత’ నివాళి


కాగా, జయలలిత అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం చెన్నైలో ముగిసాయి. కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో అమ్మ అంత్యక్రియలు జరిగాయి. మెరీనా బీచ్‌ వద్ద ఉన్న దివంగత ఎంజీ రామచంద్రన్ సమాధి పక్కనే జయలలితను ఖననం చేశారు. కొంతకాలంగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన పురచ్చి తలైవి సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.