యాప్నగరం

సుదర్శన్ ఖాతాలో మరో అరుదైన గిన్నిస్ రికార్డ్

ప్రపంచ ప్రఖ్యాత శాండ్ ఆర్టిస్టుగా పేరున్న సుదర్శన్ పట్నాయక్ మరో గొప్ప రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు.

TNN 11 Feb 2017, 8:31 pm
ప్రపంచ ప్రఖ్యాత శాండ్ ఆర్టిస్టుగా పేరున్న సుదర్శన్ పట్నాయక్ మరో గొప్ప రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన కోట రూపంలో వున్న సైకత శిల్పాన్ని సృష్టించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు సుదర్శన్ పట్నాయక్.
Samayam Telugu sudarsan pattnaik worlds tallest sandcastle created by renowned indian sand artist
సుదర్శన్ ఖాతాలో మరో అరుదైన గిన్నిస్ రికార్డ్


సుదర్శన్ సొంత రాష్ట్రమైన ఒరిస్సాలోని పూరి బీచ్ ఈ అపూర్వ ఘట్టానికి వేదికైంది. ఇటీవలే వరల్డ్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్న ఈ ఇండియన్ శాండ్ ఆర్టిస్ట్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకోవడమేకాకుండా భారత్ ఎందులోనూ తీసిపోదు అని నిరూపించారు.

అందమైన సైకత శిల్పాల్ని సృష్టించడంలో అందెవేసిన చెయ్యి అనిపించుకున్న సుదర్శన్ పట్నాయక్‌కి 2014లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే.

తాజాగా సుదర్శన్ సృష్టించిన ఈ 48.8 అడుగుల ఎత్తైన శాండ్ క్యాస్టిల్ కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.