యాప్నగరం

ఈ వినాయకుడి సైకత శిల్పం అదుర్స్

రేపు వినాయక చవితి పర్వదినం నేపథ్యంలో గ్రీన్ గణేషా క్యాంపెయిన్‌ని ప్రోత్సహిస్తూ...

TNN 24 Aug 2017, 9:40 pm
రేపు వినాయక చవితి పర్వదినం నేపథ్యంలో గ్రీన్ గణేషా క్యాంపెయిన్‌ని ప్రోత్సహిస్తూ ఒడిషాలోని పూరి బీచ్‌లో ఆకట్టుకునే రీతిలో అందమైన వినాయకుడి సైకత శిల్పాన్ని రూపొందించారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. అంతేకాకుండా "మొక్కలు నాటండి... పర్యావరణ పరిరక్షణకు పాటుపడండి" అంటూ ఈ సైకత శిల్పం ద్వారా తనదైన స్టైల్లో ఓ సందేశాన్ని కూడా ఇచ్చారు పద్మశ్రీ అవార్డుగ్రహీత సుదర్శన్ పట్నాయక్.
Samayam Telugu sudarsan pattnaiks sand art about green ganesha campaign
ఈ వినాయకుడి సైకత శిల్పం అదుర్స్

My SandArt with message “Plant a Tree; Save our Earth” on #GaneshChaturthi2017 at #Puri beach . #ClimateChange pic.twitter.com/JGF4gVgQV6— Sudarsan Pattnaik (@sudarsansand) August 24, 2017
పూరి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన ఈ సైకత శిల్పం చూపరులని ఆకట్టుకోవడమేకాకుండా పర్యావరణ పరిరక్షణకి వున్న ప్రాధాన్యతని చాటిచెబుతూ ప్రపంచానికి ఓ విలువైన సందేశాన్ని చేరవేస్తోంది. ఇలా సందర్భాన్నిబట్టి ప్రపంచానికి తాను చెప్పాలనుకున్న సందేశాన్ని తన సైకత శిల్పాల ద్వారా చెప్పడం సుదర్శన్ పట్నాయక్‌కి ఇదేమీ కొత్త కాదనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే సైకత శిల్పాలని రూపొందించడంలో ప్రపంచ ఛాంపియన్ అయ్యారు మన సుదర్శన్ పట్నాయక్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.