యాప్నగరం

సెల్ఫీ కోసం ఉరి.. ప్రాణాల మీదకు తెచ్చిన ప్రయోగం!

సెల్ఫీల పిచ్చి బాగా ముదిరిపోయిన స్మార్ట్ ఫోన్ వినియోగదారులు.. ఈ మధ్య వాటి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు..

TNN 22 Apr 2017, 3:19 pm
సెల్ఫీల పిచ్చి బాగా ముదిరిపోయిన స్మార్ట్ ఫోన్ వినియోగదారులు.. ఈ మధ్య వాటి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. సెల్ఫీల కోసం ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఉదంతాలను రోజూ చూస్తూనే ఉన్నాం. ఎత్తైన కొండల అంచున, వేగంగా వస్తున్న రైలు ముందు నిలబడి సెల్ఫీ తీసుకోవాలనుకొని ప్రాణాలు కోల్పోయినవారి గురించి మనకు తెలుసు.. కానీ, కర్ణాటకు చెందిన ఓ బాలుడు.. సెల్ఫీ కోసం ఓ వింత ఆలోచన చేశాడు. అతడు మెడకు ఉరేసుకొని, తన మిత్రుడితో కలిసి సెల్ఫీ దిగాలనుకున్నాడు. సరిగ్గా సెల్ఫీ తీసే సమయానికి వాళ్లు నిల్చున్న స్టూల్ కదిలిపోయి కిందపడింది. అతడి మెడకు ఉరి బిగుసుకోవడంతో గిలాగిలా కొట్టుకున్నాడు.
Samayam Telugu suicide drama for the sake of selfie boy admits in hospital
సెల్ఫీ కోసం ఉరి.. ప్రాణాల మీదకు తెచ్చిన ప్రయోగం!


అతడి స్నేహితుడు వెంటనే.. ఆ బాలుడి తల్లిదండ్రులను అప్రమత్తం చేశాడు. వాళ్లు ఆ బాలుణ్ని ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన ఒక వ్యాపారి.. తన వాహనాన్ని ఇచ్చి ఆదుకోవడంతో ఆ బాలుడికి సరైన సమయంలో చికిత్స అందించగలిగారు. మరణం చివరి అంచు దాకా వెళ్లిన ఆ బాలుడు.. ఇప్పుడు క్రమంగా కోలుకొన్నాడు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో కొన్ని రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read this story in Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.