యాప్నగరం

‘బతికుంటే బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేవాళ్లం’

అతడు బతికుంటే..ఇవాళ (గురువారం) అమెరికాలో హ్యాపీగా హ్యాపీ బర్త్ డే చేసుకునేవాడు. కానీ తెల్లతోలు కప్పుకున్న ఓ జాత్యహంకారి

Samayam Telugu 9 Mar 2017, 3:30 pm
అతడు బతికుంటే..ఇవాళ (గురువారం) అమెరికాలో హ్యాపీగా హ్యాపీ బర్త్ డే చేసుకునేవాడు. కానీ తెల్లతోలు కప్పుకున్న ఓ జాత్యహంకారి అలా జరగనివ్వలేదు. కుటుంబంతో కలిసి బరక్త్ డే చేసుకోవాల్సిన వాడు...ఈ లోకాన్ని వీడిన అతణ్ని స్మరిస్తూ కుటుంబ సభ్యులు తొలి జయంతి చేసుకుంటున్నారు.
Samayam Telugu sunayana says happy birth day my love to srinivas kuchibhotla
‘బతికుంటే బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేవాళ్లం’


‘మీ దేశానికి వెళ్లిపో’ అంటూ కాల్పులు జరిపాడు. అంతే ఆ విద్వేషపు కాల్పులకు యువ ఇంజనీరు నెలకొరిగాడు. అమెరికా-కేన్సస్ పట్టణంలోని ఓ బార్ లో అడమ్ ఫ్యూరింటన్ అనే ఓ శ్వేతజాతీయుడి విద్వేషానికి బలైన తెలుగు యువకుడు శ్రీనివాస్ కూచిభొట్ల జయంతి నేడు.

శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా అతని భార్య సునయన ‘హ్యాపీ బర్త్ డే మై లవ్’ అంటూ ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్టింగ్ హృదయాన్ని కదిలిస్తోంది.

ఈ విధంగా శుభాకాంక్షలు చెప్పడం చాలా వింతగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లోకాన్ని వీడిన శ్రీనివాస్...ఎక్కుడున్నా..హ్యాపీగా ఉండాలని సునయన కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు.


‘‘నిన్ను నేను చాలా మిస్సవుతున్నా’’ అంటూ సునయన పోస్ట్ చేశారు. సునయన పోస్ట్ పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. అమెరికాలో భారతీయులపై దాడులు ఖండిస్తున్నారు. జాత్యహంకార దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ లోకాన్ని వీడిన శ్రీనివాస్...ఎక్కుడున్నా..హ్యాపీగా ఉండాలని సునయన కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.