యాప్నగరం

​సన్నీ లియోన్ పై రాజకీయ పార్టీ ధ్వజం..!

మాజీ పోర్నోస్టార్.. ప్రస్తుత బాలీవుడ్ నటీమణి సన్నీ లియోన్ పై కారాలు మిరియాలు నూరుతోంది..

TNN 17 Apr 2017, 3:24 pm
మాజీ పోర్నోస్టార్.. ప్రస్తుత బాలీవుడ్ నటీమణి సన్నీ లియోన్ పై కారాలు మిరియాలు నూరుతోంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ). సన్నీ నటించిన ఒక కండోమ్ యాడ్ పై ఈ పార్టీ తీవ్రంగా విరుచుకుపడింది. టీవీల్లో ఆ యాడ్ ప్రసారాన్ని తక్షణం ఆపేయాలని కోరుతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తమ అభ్యంతరాలను తెలియ చేసింది ఈ రాజకీయ పార్టీ. ఒకవేళ ప్రభుత్వం, ఆ యాడ్ మేకర్లు దాని ప్రసారాన్ని ఆపకపోతే.. తాము రోడ్డెక్కుతామని ఈ పార్టీ ప్రకటించింది.
Samayam Telugu sunny leone is serving immorality through condom adspolitical party
​సన్నీ లియోన్ పై రాజకీయ పార్టీ ధ్వజం..!


కేందమంత్రి రామ్ దాస్ అథవాలే భార్య ఆధ్వర్యంలో నడుస్తోంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ). ఇది వరకే సన్నీ నటించిన కండోమ్ యాడ్ పై మహిళా సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు ఈ పార్టీ కూడా వారితో గొంతు కలిపింది.

సన్నీ లియోన్ నటించిన ఆ యాడ్ చాలా ఎరోటిక్ గా ఉందని, ఇంటిల్లిపాదీ టీవీ చూస్తున్నప్పుడు ఆ యాడ్ ప్రసారం కావడం చాలా ఇబ్బంది పెడుతోందని ఆర్ఫీఐ వాదిస్తోంది. ఇంట్లో ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఉన్న వారు టీవీ ముందు కూర్చోవాలంటే ఇలాంటి యాడ్ కు భయపడాల్సిన పరిస్థితి వస్తోందని ఆర్పీఐ మహిళా విభాగం నేతలన్నారు. ఈ విషయంలో అనేక కుటుంబాల నుంచి తమ వద్దకు ఫిర్యాదులు వచ్చాయని.. దీంతో ఈ యాడ్ ను నిషేధించాలనే డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై తాము ఉద్యమబాట పడతామని వారు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.