యాప్నగరం

సుష్మా మంచితనానికి నేపాల్ ప్రధాని ఫిదా

ఆమెకు ఒక్క ట్వీట్ చేస్తే చాలు చేతనైన సాయం చేస్తారామె. ఆమె మంచితనం భారతీయులకే కాదు.. పాక్ ప్రజలకు కూడా తెలుసు.

TNN 25 Aug 2017, 2:41 pm
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంచితనం గురించి.. సగటు భారతీయుడికే కాకుండా శత్రుదేశమైన పాక్ పౌరులకు కూడా తెలుసు. వైద్య సాయం కోసం ఆమెకు ఒక్క ట్వీట్ చేసి ఎందరో పాకిస్థానీయులు భారత్‌లో చికిత్స పొందడం కోసం వీసా పొందారు. ఆమెకు ట్వీట్ చేస్తే చాలు.. ఎంతటి ఆపద నుంచైనా బయటపడొచ్చనే భరోసా విదేశాల్లోని భారతీయుల్లో కనిపిస్తుంది. సాధారణ ప్రజానీకం సమస్యలు తీర్చడంలో ఆమె ముందుంటారు. భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధానికి కూడా సుష్మా మంచితనమేంటో అనుభవంలోకి వచ్చింది.
Samayam Telugu sushma swaraj offers water to coughing nepal pm sher bahadur deuba
సుష్మా మంచితనానికి నేపాల్ ప్రధాని ఫిదా


న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో నేపాల్, భారత ప్రధానులు మీడియాతో సమావేశం నిర్వహించారు. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా మాట్లాడుతూ ఒకానొక దశలో గొంతు సరిగా లేకపోవడం, దగ్గుతో మాట్లాడటానికి ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన నిలబడిన పోడియం దగ్గరకు వెళ్లారు. ఈ విషయం గమనించిన మోదీ వాటర్ జార్ మూత తీయగా.. సుష్మా గ్లాసులో నీటిని పోసి దేవుబాకు అందించారు. గ్లాసును తిరిగి తీసుకోవడానికి సుష్మా అక్కడే నిలబడగా.. సిబ్బంది అక్కడికి చేరుకుని దాన్ని తీసుకున్నారు.

@SushmaSwaraj Mam offered water to Nepal PM 4 his throat trouble! ✏️Attitude is small thing but make big difference!pic.twitter.com/o6BOncyoTa — Neetu Garg (@NeetuGarg6) August 25, 2017
ఈ సంఘటన ద్వారా భారతదేశ ఆతిథ్యంలోని గొప్పదనాన్ని సుష్మా ప్రపంచానికి మరోసారి చాటారు. మంత్రి హోదాలో ఉండి కూడా ఆమె అలా చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సమావేశంలో నేపాల్ ప్రధాని మాట్లాడుతూ.. భారత్‌కు వ్యతిరేకంగా జరిగే పనులకు మేం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోం అని చైనాకు పరోక్షంగా తేల్చి చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.