యాప్నగరం

సిక్కోలు లక్ష్యానికి సైకత శిల్పం!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంతో దేశ ప్రజల్లో కాస్త చైతన్యం వచ్చిందనే చెప్పాలి.

TNN 19 Nov 2017, 10:02 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంతో దేశ ప్రజల్లో కాస్త చైతన్యం వచ్చిందనే చెప్పాలి. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసింది. మరుగుదొడ్ల నిర్మాణంలో భాగంగా పేద ప్రజలకు ప్రోత్సాహకాలు కూడా అందజేసింది. ఒకప్పుడు మరుగుదొడ్లు కనిపించని చాలా గ్రామాల్లో నేడు అవి దర్శనమిస్తున్నాయి. తమ ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ బహిర్భూమికి వెళ్లే ఆడపడుచుల సంఖ్య గణనీయంగా తగ్గిందనడంలో ఎలాంటి సందేహంలేదు. మరుగుదొడ్లు అనే పదం కఠినంగా ఉందని ప్రధాని పిలుపు మేరకు ఈ మధ్య వాటి పేర్లను ‘ఆత్మగౌరవ గృహాలు’గా మార్చారు.
Samayam Telugu tarani prasad mishra sand art on world toilet day
సిక్కోలు లక్ష్యానికి సైకత శిల్పం!


ఇదిలా ఉంటే నేడు (నవంబర్ 19) ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్రా అద్భుతమైన సైకత శిల్పాన్ని నిర్మించారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని కోరుతూ ఈ సైకత శిల్పాన్ని తయారుచేసినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలింగపట్నం సముద్రతీరంలో ఈ సైకత శిల్పాన్ని నిర్మించారు. ‘ఇంటింటా ఆత్మగౌరవ గృహం సిక్కోలు లక్ష్యం’ అని సైకత శిల్పం రాశారు.

మరోవైపు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా మరిన్ని టాయిలెట్ల నిర్మాణానికి ఎంతగానో కృషిచేస్తున్న వ్యక్తులకు, సంస్థలకు మోదీ మెచ్చుకున్నారు. వారి అమూల్యమైన సహకారం స్వచ్ఛ భారత్ మిషన్‌కు ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు.
I compliment all those individuals and organisations working towards building more toilets in various parts of India. Their invaluable contribution adds solid momentum to Swachh Bharat Mission. — Narendra Modi (@narendramodi) November 19, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.