యాప్నగరం

సహచర టీచర్‌ను రాత్రికి రమ్మన్న ఉపాధ్యాయుడు!

వందల మంది విద్యార్థుల సమక్షంలోనే ఇలాంటి చర్యలకు పాల్పడటం విస్మయాన్ని కలిగిస్తోంది.

TNN 24 Jul 2017, 9:45 am
అతడు ఉపాధ్యాయుడు, అయితే అదే వృత్తిలో ఉన్న ఒక మహిళను చూసి కీచకుడి అవతారం ఎత్తాడు. ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు, రాత్రికి వస్తే..నీకు ఫేవర్ చేస్తా.. అన్నాడు, అతడి తీరుతో షాక్ అయిన ఆ మహిళా ఉపాధ్యాయిని, చెప్పు తీసి సమాధానం ఇచ్చింది. అక్కడిక్కడే ఆమె అలా స్పందించింది. అయితే అక్కడికీ వెనక్కు తగ్గని ఆ టీచకుడు ఆ మహిళపై ఎదురుదాడి చేశాడు. ఆ ఉపాధ్యాయురాలిని చెప్పుతో కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుకు ప్రతిగా ఆ ఉపాధ్యాయుడు కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. అనంతపురం జిల్లా కదిరిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu teacher asked sexual favour from his colleague
సహచర టీచర్‌ను రాత్రికి రమ్మన్న ఉపాధ్యాయుడు!


బాధితురాలి కథనం ప్రకారం.. కదిరి మున్సిపల్ స్కూల్ లో పని చేస్తున్న గౌసుద్ధీన్ అనే ఉపాధ్యాయుడు ఆమె తో వెకిలి వేషాలు వేశాడు. ఆదివారం రోజున ‘హ్యాపీ సండే’ పేరుతో జరిగిన కార్యక్రమం ముగిసిన తర్వాత ఉపాధ్యాయులు అంతా వెళ్లిపోతున్న తరుణంలో.. మహిళా ఉపాధ్యాయురాలిని దగ్గరకు పిలిచాడు గౌసుద్ధీన్. ‘మీరు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు కదా.. నేను మిమ్మల్ని రిలీవ్ చేయిస్తాను. అయితే ఈ రాత్రి మీరు నా దగ్గరకు వస్తే.. ఆ పని జరుగుతుంది..’ అని వ్యాఖ్యానించాడు. అతడి ప్రతిపాదనకు షాక్ అయిన ఆమె చెప్పు తో కొట్టింది.

దీంతో నివ్వెరపోయిన గౌసుద్దీన్ కూడా తన చెప్పు తీసి ఆమెను కొట్టాడు. మున్సిపల్ కమిషనర్, అనేక మంది ఉపాధ్యాయులు, వందల మంది విద్యార్థుల ముందు ఇదంతా జరిగింది. గౌస్ తనతో అలా మాట్లాడటమే కాకుండా, తనపై దాడి కూడా చేయడంతో.. సదరు ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు తనను కులం పేరుతో కూడా దూషించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు గౌస్ పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతో సహా, లైంగిక వేధింపు కేసులను నమోదు చేశారు. అయితే ఆ మహిళా ఉపాధ్యాయురాలే తనను చెప్పుతో కొట్టిందని గౌస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

మరి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు.. వందల మంది విద్యార్థుల సమక్షంలోనే ఇలాంటి చర్యలకు పాల్పడటం విస్మయాన్ని కలిగిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.