యాప్నగరం

టీచర్ నిర్వాకం.. తలుపులో ఇరుక్కున్న విద్యార్థిని తల!

ఓ ఉపాధ్యాయుని నిర్వాకం కారణంగా ఎనిమిదేళ్ల విద్యార్థిని నరకయాతన అనుభవించింది.

TNN 6 Aug 2017, 4:25 pm
ఓ ఉపాధ్యాయుని నిర్వాకం కారణంగా ఎనిమిదేళ్ల విద్యార్థిని నరకయాతన అనుభవించింది. తలుపులో తల ఇరుక్కుపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బాలిక పరిస్థితిని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో ఆమె ప్రాణాలను కాపాడగలిగారు. ఆగ్రా నగరానికి 80 కి.మీ. దూరంలో ఉన్న బాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధోబాయి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సాక్షి (8) అనే బాలిక స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది. సాక్షి చేసిన తప్పేంటో తెలియదు కానీ టీచర్ ఆమెకు కఠినమైన శిక్షే విధించారు. సాక్షిని తరగతి గదిలోనే బంధించి తలుపులకు తాళం వేసుకుని టీచర్, మిగిలిన విద్యార్థులు వెళ్లిపోయారు.
Samayam Telugu teacher locks girl in classroom her head gets stuck between doors for 2 hours
టీచర్ నిర్వాకం.. తలుపులో ఇరుక్కున్న విద్యార్థిని తల!


దీంతో ఆ బాలిక ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంది. తలుపు రెండు రెక్కల మధ్య ఉన్న ఖాళీలో నుంచి దూరేందుకు ప్రయత్నించింది. శరీర భాగమంతా బయటికి వచ్చి తల మాత్రం రెండు రెక్కల మధ్య ఇరుక్కుపోయింది. అలాగే సుమారు రెండు గంటలపాటు ఉండిపోయింది. బాలిక భయంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బాలిక పరిస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రిన్సిపల్‌కు ఫోన్ చేశారు. ఆమె ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తాళాలు పగలగొట్టి సాక్షిని సురక్షితంగా భయటికి తీశారు. వైద్యం నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

కాగా, బాలికను తరగతి గదిలో బంధించిన టీచర్‌ను.. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్‌ను జిల్లా విద్యాధికారి సస్పెండ్ చేశారు. బాలిక తల తలుపులో ఇరుక్కుని ఇబ్బందిపడుతున్న సమయంలో కొందరు తమ సెల్‌ఫోన్లతో వీడియో తీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.