యాప్నగరం

ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ చంపేశారు

మానవత్వం మంటగలిసిపోతోంది.. ఓవైపు మనిషి ప్రాణాలు కోల్పోతోంటే వారి కాపాడి ప్రాణాలు నిలబెట్టాల్సిందిపోయి....

TNN 21 Jul 2017, 9:08 pm
మానవత్వం మంటగలిసిపోతోంది.. ఓవైపు మనిషి ప్రాణాలు కోల్పోతోంటే వారి కాపాడి ప్రాణాలు నిలబెట్టాల్సిందిపోయి ఏదో సినిమా చూసినట్టు చూస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు జనం. కనీసం ఎందుకూ పనికిరాని జీవం లేని ఫోటోలు, వీడియోలకి ఇచ్చినంత విలువైనా కళ్లముందు కొన ఊపిరితో చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్న ప్రాణానికి ఇవ్వలేకపోతున్నారు. ఫలితంగా అత్యవసరంగా స్పందిస్తే బతకాల్సిన ప్రాణాలు కొన్ని నిజంగానే గాల్లో కలిసిపోతున్నాయి.
Samayam Telugu techie died on road as passersby click photos and videos
ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ చంపేశారు


తరచుగా దేశం నలుమూలలా ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా... మనుషుల్లో మార్పు మాత్రం రావడంలేదు. తాజాగా పూణెలో మరోసారి ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఓ 25 ఏళ్ల యువకుడిని ఆస్పత్రికి తరలించాల్సింది పోయి అతడి నరకయాతనని తమ మొబైల్ కెమెరాల్లో బంధిస్తూ నిలబడిపోయారు.

గురువారం పూణెలోని ఇంద్రాణినగర్‌లో సతీష్ ప్రభాకర్ అనే యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని ఓ వాహనం ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సతీష్ చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంటే, చుట్టూ చేరిన వాళ్లు ఎవ్వరూ అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయలేదు. ప్రమాదం జరిగిన తర్వాత చాలాసేపటికి అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి స్పందించి సతీష్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ... అప్పటికే అతడు మృతిచెందాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.