యాప్నగరం

అడ్రస్ కావాలంటూ మైనర్‌కు ఫోన్లో పోర్న్ వీడియో...

పుణేలో మహిళలపై అకృత్యాలు ఇప్పట్లో ఆగేలా లేదు. నగరంలో ఏదో ఓ ప్రాంతంలో కీచకులు పంజా విసురుతున్నారు.

TNN 27 Feb 2017, 4:20 pm
పుణేలో మహిళలపై అకృత్యాలు ఇప్పట్లో ఆగేలా లేదు. నగరంలో ఏదో ఓ ప్రాంతంలో కీచకులు పంజా విసురుతున్నారు. ఇన్ఫోసిస్ ఉద్యోగిని హత్య, పింప్రీ ప్రాంతంలో ఓ 19 ఏళ్ల యువతిపై అత్యాచారం, మాజీ ప్రియుడి చేతిలో హత్యకు గురైన ఓ మహిళ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నెలలో మహిళలపై అఘాయిత్యాలు చాలానే చోటు చేసుకున్నాయి. ఓ పదిహేనేళ్ల బాలికకు పోర్న్ వీడియో చూపి లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన తాజాగా వెలుగుచూసింది.
Samayam Telugu teenager molested shown porn clip in smart city hub
అడ్రస్ కావాలంటూ మైనర్‌కు ఫోన్లో పోర్న్ వీడియో...


బాధితురాలు సాయంత్రం 5.30 ప్రాంతంలో కోచింగ్ క్లాసులకు వెళ్తుండగా ఓజాస్ సొసైటీ దగ్గర కారులో నుంచి దిగిన ఓ 30 ఏళ్ల వ్యక్తి పషాన్‌కు దారి చెప్పమంటూ అడిగాడు. అడ్రస్ సరిగ్గా పేర్కొంటే డైరెక్షన్స్ ఇస్తానని తెలిపింది. దీంతో నిందితుడు తన మొబైల్ ఫోన్ తీసి అడ్రస్ చూపిస్తానంటూ ఆమెకు పోర్న్ వీడియోలు చూపించాడు. ఈ చర్యలకు షాక్ తిన్న బాలిక అక్కడే కుప్పకూలిపోయింది. పది రోజుల వరకు ఈ ఘటనపై ఎవరితోనూ చెప్పలేదు.

కూతురు పరిస్థితిని గమనించిన ఆమె తండ్రి ఏం జరిగిందో చెప్పమంటూ ప్రశ్నించాడు. దీంతో ఆ బాలిక జరిగిన విషయం తండ్రికి చెప్పింది. ఫిబ్రవరి 15 న ఈ ఘటన చోటు చేసుకుంటే ఫిబ్రవరి 26 న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు చర్యలతో షాక్‌కు గురైన ఆ బాలిక తేరుకోడానికి పది రోజులు పట్టిందని తండ్రి పేర్కొన్నట్లు చతుర్‌శృంగి పోలీస్ స్టేషన్ అధికారి వర్ష షిండే తెలిపాడు.

ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌‌లను పరిశీలించి నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు కొంతమంది తల్లిదండ్రులు తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.