యాప్నగరం

హైదరాబాదీలు వణికిపోతున్నారు..

హైదరాబాద్ నగరాన్ని చలి గజగజలాడించేస్తోంది.

TNN 21 Dec 2016, 9:24 am
హైదరాబాద్ నగరాన్ని చలి గజగజలాడించేస్తోంది. రోజురోజుకు నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం నాడు 12.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఈ నేపథ్యంలో బయటకు రావాలంటేనే నగర వాసులు భయపడుతున్నారు. గత కొద్ది రోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది చలి తీవ్రత అధికంగానే ఉందని అధికారులు చెప్పారు.
Samayam Telugu temperature drops down in hyderabad
హైదరాబాదీలు వణికిపోతున్నారు..



ఎక్కడ చూసినా పొగమంచు పరుచుకున్న నేపథ్యంలో రాత్రిపూట, ఉదయం సమయాల్లో వాహనాలను జాగ్రత్తగా నడపాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే, చలి తీవ్రత నేపథ్యంలో అనారోగ్యం సంభవించే అవకాశం కూడా ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.