యాప్నగరం

యూపీ సీఎం గురువు... ఓ ముస్లిం

యోగి ఆదిత్యనాథ్ పక్కా హిందూత్వ వాది. బ్రహ్మచర్య దీక్షను స్వీకరించిన వ్యక్తి.

TNN 28 Mar 2017, 2:18 pm
యోగి ఆదిత్యనాథ్ పక్కా హిందూత్వ వాది. బ్రహ్మచర్య దీక్షను స్వీకరించిన వ్యక్తి. గోమాతను దేవతలా పూచించే వ్యక్తి. హిందూ ఆచార వ్యవహారాలను కచ్చితంగా పాటించాలనే దృక్పథం ఉన్న వ్యక్తి. అలాంటి యోగి ఆదిత్యనాథ్ కు గురువు ఓ ముస్లిం. నమ్మశక్యంగా లేనప్పటికీ ఇది నిజం. గుజరాత్ లోని విస్నగర్ లో పెద్ద ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమ గురువు మహంత్ అవైద్యనాథ్. అతని శిష్యుడు మహంత్ గుల్బనాథ్ బాపు. అవైధ్యనాథ్ కి మరోప్రియశిష్యుడు కూడా ఉన్నారు. అతనే ప్రస్తుతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. గతేడాది డిసెంబర్లో మహంత్ గుల్బనాథ్ బాపు మరణించారు. అతని అంత్యక్రియల కోసం ఆదిత్యనాథ్ గుజరాత్ వెళ్లి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చారు. గుల్బనాథ్ ని యోగి ఆదిత్యనాథ్ తన గురుభాయ్ గా భావిస్తారు. ఇందులో చెప్పకోవాల్సిన అంశం ఏమిటంటే... అసలు గుల్బనాథ్ హిందువే కాదు, ఓ ముస్లిం. కరడుగట్టి హిందూత్వ వాది అయిన ఆదిత్యనాథ్ జన్మపరంగా ముస్లిం అయిన వ్యక్తిని గురువుగా భావించడం చెప్పుకోవాల్సిన అంశమే.
Samayam Telugu the muslim who became adityanaths gurubhai
యూపీ సీఎం గురువు... ఓ ముస్లిం


మహంత్ గుల్బనాథ్ బాపు పద్దెనిమిదేళ్ళ వయసు వరకు ముస్లిం వ్యక్తిగానే పెరిగారు. ఆ వయసులో ఆశ్రమానికి చెందిన మహంత్ బాలాకాంత్ ను చూసి స్పూర్తి పొందారు. తాను కూడా దీక్ష తీసుకోవాలని, హిందువుగా మారాలని అనుకున్నారు. అందుకు మహంత్ బాలాకాంత్ ఒప్పుకుని ఆయనకు దీక్షను ఇచ్చారు. అలా 86 ఏళ్ల వయసు వరకు హిందూ ఆచారాలనే పాటిస్తూ వచ్చారు. దీర్ఘ అనారోగ్యంతో గతేడాది మరణించారు. తన తరువాత యోగి ఆదిత్యనాత్ ను ఆశ్రమానికి మఠాధిపతిని చేశారు. యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా ఎన్నికవ్వడంతో ఆయన స్థానంలో మరొకరిని ఆశ్రమానికి అధిపతిని చేశారు.

మహంత్ గుల్బనాథ్ కుటుంబీకులు ఇస్లాంలో సుఫీ సాంప్రదాయాన్ని పాటించేవారని చెబుతారు. వారు వ్యవసాయం చేసే వారని అంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.