యాప్నగరం

దుండగులతో పోరాడి యజమాని ప్రాణాలు కాపాడిన కుక్క!

కుక్కను విశ్వాసం గల జంతువు ఎందుకంటారో మరోసారి రుజువైంది. తన యజమానిని ప్రాణాలను దండగుల బారి నుంచి రక్షించడమే కాదు,

TNN 16 Mar 2017, 3:58 pm
కుక్కను విశ్వాసం గల జంతువు ఎందుకంటారో మరోసారి రుజువైంది. తన యజమానిని ప్రాణాలను దండగుల బారి నుంచి రక్షించడమే కాదు, రూ.5 లక్ష విలువైన సొత్తును కూడా కాపాడింది. ఈ ఘటన బెంగళూరులోని మహాలక్ష్మీ లేఅవుట్‌లో చోటు చేసుకుంది. మహాలక్ష్మీ లేఅవుట్‌లో నివసించే ఓ ప్రొఫెసర్ రోజూ ఉదయం 5.30 గంటలకు పాల కోసం తన స్కూటర్‌పై వెళుతుంటాడు.
Samayam Telugu this dog fought off armed robbers saved owner
దుండగులతో పోరాడి యజమాని ప్రాణాలు కాపాడిన కుక్క!


ఎప్పటిలాగే మార్చి 8 న కూడా ఆయన పాల ప్యాకెట్ కోసం బయలుదేరుతుండగా ఆయన పెంపుడు కుక్క లియో కూడా ఆ రోజు నేనూ వస్తానన్నట్లుగా చూసింది. దీంతో ఆ ప్రొఫెసర్ లియోను కూడా తనతోపాటు సమీపంలోని నందిని మిల్క్ పార్లర్‌కు తీసుకెళ్లాడు. ఎప్పుడూ ఒంటరిగా వెళ్లే ఆయన ఆ రోజు మాత్రం లియోను తన వెంట తీసుకెళ్లడం ఓ పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. పాల ప్యాకెట్ తీసుకుని తిరిగి వస్తుండగా 15 వ సర్కిల్ దగ్గర ఓ కారు ఆయన స్కూటర్‌ను గుద్దింది.

కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కిందకు దిగి ప్రొఫెసర్‌పై దాడికి యత్నించారు. ఒకడు ఆయన అరవకుండా నోరు మూస్తే, ఇంకొకడు కత్తి పట్టుకుని మెడలోని బంగారు గొలుసు ఇతర విలువైనవి ఇచ్చేయమని డిమాండ్ చేశారు. మీరు అడిగినవన్నీ ఇచ్చేస్తాను, నాకు మాత్రం ఎలాంటి హాని చేయకండని ఆయన ప్రాధేయపడ్డాడు. ఇంతలో నా మెడ మీద కత్తిపెట్టిన వ్యక్తిపై లియో ఒక్కసారిగా దాడిచేసి అతడిని గాయపరిచింది.

అంతటి ఆగకుండా మిగతా ఇద్దరిపైనా దాడి చేయడంతో వారు అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు. అలాగే వారిని కొంతదూరం వరకు వెంబడించిందని ఆయన తెలిపాడు. ఆ తర్వాత సమీపంలో ఉన్న ఓ ఇంటికి వెళ్లి తన కుమారుడికి ఫోన్ చేశాను. ఈ విషయం తెలిసిన తన భార్య, కొడుకు అక్కడకు చేరుకున్నారు. ఆయుధాలు ధరించిన దుండగులతో లియో పోరాడిన విషయం చెప్పడంతో, నా కుమారుడు దాన్ని వెదకడానికి వెళితే తన స్కూటర్ పక్కనే ఉంది.

కానీ ఆ ప్రొఫెసర్ కొడుకు లియోను కారులోకి బలవంతంగా ఎక్కించినా అందులో నుంచి దూకి స్కూటర్ దగ్గరకు వచ్చేసింది. ఈ ఘటనపై సెక్షన్ 398 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.