యాప్నగరం

వీడు.. అమ్మాయి వీపు చూస్తే వదలడు!

తడి పేరు వినయ్ నయర్. పేరులో ఉన్న ‘వినయం’ మనిషిలో ఏ మాత్రం కనిపించదు. అమ్మాయిల వీపు కనిపిస్తే చాలు.. టచ్ చేయకుండా ఉండలేడు.

Samayam Telugu 18 Oct 2017, 4:24 pm
తడి పేరు వినయ్ నయర్. పేరులో ఉన్న ‘వినయం’ మనిషిలో ఏ మాత్రం కనిపించదు. అమ్మాయిల వీపు కనిపిస్తే చాలు.. టచ్ చేయకుండా ఉండలేడు. అంతేకాదు, అలా టచ్ చేస్తూ వీడియోలు తీసి ఆనందింస్తాడు. వాటిని ఇన్‌స్టాగ్రమ్, ఫేస్‌బుక్‌లలో కూడా పోస్ట్ చేస్తూ.. తన పైశాచికాన్ని ‘షేర్’ చేస్తున్నాడు. మణిపాల్‌కు చెందిన మెడికల్ స్టూడెంట్ అంగద్ గుమ్మరాజు ఆ వీడియోలు చూసి విస్తుపోయింది. వాటి స్క్రీన్ షాట్ తీసి.. సోషల్ మీడియా ద్వారా అతడి చేష్టలను బయటపెట్టింది.
Samayam Telugu this insta user posts disgusting videos of himself touching women in public
వీడు.. అమ్మాయి వీపు చూస్తే వదలడు!


వినయ్ ఇలాంటివి 144 పోస్టులు సోషల్ మీడియాలో పెట్టాడు. ఇతనికి 1,646 ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రమ్, ఫేస్‌బుక్‌లకు పలు ఫిర్యాదులు అందటంతో ప్రస్తుతం అతని అకౌంట్‌ను బ్లాక్ చేశారు. గత ఆదివారం నుంచి ట్రెండింగులో ఉన్న ‘MeToo’ స్పందనల్లో భాగంగా ఇతగాడి బాగోతం బయటకు వచ్చింది. కేవలం ఇతడే కాదు.. ఈ ‘మీ టూ’ మహిళా ట్విట్టరోద్యమం.. మరెంతో మంది ‘మృగాళ్ల’ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.