యాప్నగరం

మరిదిని రక్షించడానికి తుపాకి పట్టిన మహిళ!

ఢిల్లీకి చెందిన ఆయేషా ఫలాక్ రైఫిల్ షూటింగ్‌‌లో ఛాంపియన్.... 2015 నేషనల్ ఛాంపియన్‌షిప్ షూటింగ్ గోల్డ్ మెడల్ విన్నర్.

TNN 29 May 2017, 11:36 am
ఢిల్లీకి చెందిన ఆయేషా ఫలాక్ రైఫిల్ షూటింగ్‌‌లో ఛాంపియన్.... 2015 నేషనల్ ఛాంపియన్‌షిప్ షూటింగ్ గోల్డ్ మెడల్ విన్నర్. ఈ సారి మాత్రం ఆమె ఏ జాతీయ, అంతర్జాతీయ టోర్నీ కోసం కాకుండా, దుండగుల బారి నుంచి తన మరిదిని రక్షించుకోడానికి లైసెన్డ్స్ రివాల్వర్ తీసుకుని సివంగిలా ముందుకు దూకింది. కిడ్నాపర్ల చెర నుంచి మరిదిని విడిపించడానికి వారి ప్రాణాలకు హాని కలగకుండా రెండు సార్లు కాల్పులు జరిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 33 ఏళ్ల ఆయేషా ఫలాక్ జాతీయస్థాయి షూటింగ్ క్రీడాకారిణి. గత ఆరేళ్లుగా అయేషా షూటింగ్‌లో నిలకడగా రాణిస్తోంది.
Samayam Telugu this is how delhis ayesha falak saved her brother in law from kidnappers
మరిదిని రక్షించడానికి తుపాకి పట్టిన మహిళ!


ఆమె మరిది ఆసిఫ్ ఫలాక్ ఓ టాక్సీ డ్రైవర్. ఆన్‌లైన్‌లో ఇద్దరు వ్యక్తులు ఫలాక్ ట్యాక్సీని బుక్ చేసుకున్నారు. వారిని తమను పికప్ చేసుకోడానికి ఆసిఫ్ వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో టాక్సీ ఎక్కిన దుండగులు, హర్యానా సరిహద్దుల వరకూ అందులో ప్రయాణించి ఆసిఫ్‌ను బంధించారు. ఆపై ఆయేషా భర్త షీర్ అలామ్‌కు ఫోన్ చేసి రూ. 25 వేలు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలాక్ ఘటనా స్థలానికి భార్యతో సహా బయలుదేరాడు. ఈ ఇద్దర్నీ పోలీసుల వాహనంలో అనుసరించారు. డబ్బు తీసుకు వస్తున్నామని చెప్పిన ఫలాక్, తమ వెంట పాయింట్ 32 రివాల్వర్‌ను కూడా తీసుకెళ్లారు.

ఘటనా స్థలికి చేరుకునే సరికి వారి వెనుక పోలీసులు కూడా వస్తున్నట్లు దుండగులు గమనించడంతో అయేషా దంపతులను చంపాలని పెద్దగా అరుస్తూ కారు దిగారు. దీంతో ఆయేషా తన తుపాకితో గురిచూసి నిందితుల కాళ్లపై కాల్పులు జరిపింది. ఈ సమయానికి పోలీసులు అక్కడకు చేరుకుని కిడ్నాపర్లను బంధించారు. కాల్పులు జరిపేందుకు తానేమీ భయపడలేదని, అమ్మాయిలకు తాను స్వీయ రక్షణ టెక్నిక్స్ నేర్పుతానంటూ ఆయేషా వెల్లడించారు. నిందితులైన మహమ్మద్ రఫీ, ఆకాష్‌లకు ప్రాణహాని కలగకుండా చాకచక్యంగా వ్యవహరించిన ఆయేషా‌పై పోలీసులు ప్రశంసల వర్షం కురిపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.